Hot Posts

6/recent/ticker-posts

ఇజ్రాయెల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ బిల్డింగ్‌పై మిసైల్ దాడి.. ఇరాన్ దూకుడు..


అమెరికా దంకీ ఇచ్చినా బెదరని ఇరాన్ తన పని తాను చేసుకుపోతోంది. వరుసగా ఇజ్రాయెల్ నగరాలపై మిసైళ్ల వర్షం కురిపిస్తూ దాడులను తీవ్రతరం చేసింది. తాజాగా తెహ్రాన్ ఇజ్రాయెల్ నగరాలపై ఏకంగా 25 మిసైల్ దాడులకు పాల్పడినట్లు వెల్లడైంది. 

అయితే ఈ దాడుల్లో ఇజ్రాయెల్ కి చెందిన స్టాక్ ఎక్స్ఛేంజ్ భవనం కూడా మిసైల్ దాడికి గురైనట్లు నివేదించబడింది. టెల్ అవివ స్టాక్ ఎక్స్ఛేంజీ గడచిన నెల రోజుల్లో దాదాపు 3.24 శాతం పెరుగుదలను నమోదు చేసింది. అలాగే గత ఆరు నెలలుగా ఇజ్రాయెల్ హమాస్, ఇరాన్ దేశాలపై దాడులు చేస్తుండగా ఆ దేశ స్టాక్ మార్కెట్లు మాత్రం 40 శాతం వరకు లాభపడ్డాయని వెల్లడైంది. 

ఇరాన్ మిసైళ్లు ఇజ్రాయెల్ నగరాల్లోని జనావాసాలు, హాస్పిటళ్లతో పాటు మరిన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని తాకుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ ఆసుపత్రిపై పడిన మిసైల్ చాలా మందిని గాయపరచింది. ఇదే సమయంలో ఏమాత్రం వెనక్కి తగ్గని ఇజ్రాయెల్ ఇరాన్ లోని అనేక ప్రాంతాలతో పాటు అణు కేంద్రాలపై తన దాడులను కొనసాగిస్తోందని వెల్లడైంది. 

గడచిన వారం రోజులుగా రెండు దేశాల మధ్య కొనసాగుతున్న దాడులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ దాడుల్లో ఇరాన్ మిలిటరీ అగ్రనేతలను సైతం ఇజ్రాయెల్ హతమార్చింది. అలాగే ఇరాన్ అణు కేంద్రాలను టార్గెట్ చేస్తూ చేసిన దాడుల్లో భారీగా డ్యామేజ్ జరిగింది. వందల మంది ఇరాన్ ప్రజలు మరణించారు. అయితే రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం గతంలో ఎన్నడూ చూడని తారా స్థాయిలకు చేరుకోవటంతో మధ్యప్రాశ్చంలోని అనేక దేశాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి
WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now