3,00,105 మంది యోగాలో పాల్గొని రికార్డు సృష్టించినట్లు పేర్కొన్న గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ట్వీట్‌కు స్పందించిన నారా లోకేశ్
ఈవెంట్ విజయంలో భాగస్వాములైన టీడీపీ నేతలు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపిన లోకేశ్
వేదికను విజయవంతంగా నిర్వహించిన అధికారులు, సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన లోకేశ్
ANDRAPRADESH:ఆంధ్రప్రదేశ్ యోగాతో ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. నిన్న విశాఖలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో 3,00,105 మంది పాల్గొని రికార్డు సృష్టించారని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కొనియాడింది. ఈ మేరకు ఆ సంస్థ ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
బ్రాండ్ విశాఖ వేదికగా ఈ సరికొత్త రికార్డు సాధించామని ఆయన పేర్కొన్నారు. ఈ విజయంలో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలకు లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రభుత్వ అధికారులు, సహకరించిన ప్రతి ఒక్కరికీ మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలియజేశారు.