Hot Posts

6/recent/ticker-posts

వైఎస్ అవినాష్ అనుచరుల వల్ల ప్రాణహాని...: సునీల్ యాదవ్


వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులవల్ల తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...

ANDRAPRADESH:వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులవల్ల తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. ఈ మేరకు శనివారం రాత్రి పులివెందుల పోలీసులకు ఆశ్రయించారు. పులివెందులలో కుటుంబంతో కలిసి గుడికి వెళ్లిన సమయంలో కారును అవినాష్ రెడ్డి అనుచరులు అనుసరించారని ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు.

ఇక, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీల్ యాదవ్ ఏ2గా ఉన్న సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు, మద్దతుదారుల నుంచి తనకు ప్రాణహాని ఉందని సునీల్ యాదవ్ ఆరోపిస్తున్నారు. గతంలో హత్య సినిమాపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, వైసీపీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు.

హత్య సినిమాపై తాను ఫిర్యాదు చేయడం తప్పైందని... ఫిర్యాదు చేయడంలో తప్పు ఏమిటనేది వాళ్లే (వైసీపీ) చెప్పాలని సునీల్ యాదవ్ అన్నారు. తాను ఆధారాలు ఇస్తేనే పోలీసులు కేసు నమోదు చేశారని... దర్యాప్తు జరుగుతుందని అన్నారు. పోలీసుల విచారణలో హత్య సినిమా ఎవరూ తీయించారు?, సినిమా వెనక ఎవరున్నారు? ... అనే విషయాలు తెలుస్తాయని అన్నారు. సినిమాలో నలుగురినే ఎందుకు హైలెట్ చేశారని.. మిగిలిన నలుగురిని (అవినాష్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి) ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. వివేకం సినిమాను ఛార్జ్‌షీట్ ప్రకారం తీశామని చెప్పుకుంటున్నారని... ఆ సినిమాలో తన తల్లి, ఆడవాళ్ల మనోభావాలను దెబ్బతీయలేదని, అందుకే ఆ సినిమాపై చర్యలు కోరడం లేదని తెలిపారు

వివేకా హత్య కేసులో తాను అనుమానితుడేనని.. హంతకుడనే ముద్ర వేయాల్సిన అవసరం లేదని అన్నారు. హత్య సినిమా తీసింది వేరే వాళ్లని... పేర్లు వేసింది వేరే వాళ్లవని అనుమానం కలుగుతుందని అన్నారు. రూ. 500కు ఇబ్బంది పడే సునీల్ యాదవ్ కోట్లకు పడగలెత్తాడని తనపై వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపణలు చేశారని... అయితే తన వద్ద కోట్లాది రూపాయాలు ఉంటే తాను అద్దె ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. తన వద్ద కోట్ల రూపాయలు ఉంటే, అవి ఎక్కడున్నాయో నిరూపించాలని రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి సవాలు చేశారు.

అయితే తాజాగా సునీల్ యాదవ్ మరోసారి పులివెందుల పోలీసులను ఆశ్రయించారు. వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులవల్ల తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు.
WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now