Hot Posts

6/recent/ticker-posts

జగన్ వ్యతిరేక 'వ్యూహం'.. సినిమాలు 'సిద్ధం' అవుతున్నాయా?


ఏపీలో 2019 ఫిబ్రవరిలో సార్వత్రిక ఎన్నికలకు ముందు 'యాత్ర' సినిమా విడుదలైన సంగతి తెలిసిందే

ANDRAPRADESH:ఏపీలో 2019 ఫిబ్రవరిలో సార్వత్రిక ఎన్నికలకు ముందు 'యాత్ర' సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా వైసీపీకి బాగా కలిసొచ్చిందని చెబుతారు. ఇదే సమయంలో.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీకి వ్యతిరేకంగా కొన్ని సినిమాలు వచ్చాయి. అందులో పవన్ కల్యాణ్ ను కూడా ప్రత్యేకంగా చూపించారు. ఈ క్రమంలో జగన్ వ్యతిరేక సినిమాలు నిర్మాణంలో ఉన్నట్లు తెలుస్తోంది.

అవును.. జగన్ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కొన్ని సినిమాలొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో కొన్ని సన్నివేశాలు అత్యంత వ్యంగంగా చిత్రీకరించారు! పైగా.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్, లోకేష్ లను పోలినట్లు ఉన్న రూపాలను ఏరి మరీ కాస్టింగ్ లో చేర్చారు. అప్పట్లో ఈ విషయంపై టీడీపీ నేతలు న్యాయపోరాటాలు చేశారు!

అయితే ఇప్పుడు కూటమి వంతు వచ్చింది! వాస్తవానికి ఇప్పటికే వివేకా మర్డర్ కేసు కథాంశంగా ఓ సినిమా వచ్చింది! ఈ సినిమా విషయంలో వైసీపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినట్లు కనిపించినా.. సినిమా మాత్రం అంతగా ప్రజాదరణ పొందలేదనే చెప్పాలి! అయితే... ఈసారి మాత్రం పక్కా ప్లానింగ్ తో, సూపర్ పబ్లిసిటీతో జగన్ కు వ్యతిరేకంగా సినిమాలు ప్లాన్ చేస్తున్నారని ప్రచారం తెరపైకి వచ్చింది.!

ఈ సందర్భంగా పలువురు సినీ జనాలు ఈ మేరకు ప్రభుత్వ పెద్దల వద్ద ప్రస్థావించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు జగన్ హయాంలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా కథలు సిద్ధపరుస్తున్నారని.. ఇందులో బటన్ నొక్కే కార్యక్రమం, పర్యటనల్లో పరదాలు వంటి అంశాల్ని ఎక్కువగా హైలెట్ చేస్తున్నారని అంటున్నారు. 

సినిమా టైటిల్స్.. ‘అన్నొస్తున్నాడు చెట్లు నరకండి’, ‘పర్యటనల్లో పరదాలు’, ‘అన్న వచ్చె.. చెట్లు చచ్చే’ మొదలైన పదాలకు అనుగుణంగానే ఉండొచ్చనే చర్చ జరుగుతుంది. ఈ విషయంలో లోకేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే... జగన్ హయాంలో టీడీపీకి వ్యతిరేకంగా వచ్చినవాటికంటే ఎక్కువగానే జగన్ కు వ్యతిరేకంగా సినిమాలు ఈ నాలుగేళ్లలో వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.

WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now