Hot Posts

6/recent/ticker-posts

సిద్ధార్థ యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు


డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, కే గంగవరం మండలం, బ్యూరో: మండలంలోని దంగేరు గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు ఘనంగా సిద్ధార్థ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కే గంగవరం మండలం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జానీ భాష హాజరై జెండా ఆవిష్కరించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో ఉన్నతమైన పదవులు చేపట్టి ప్రపంచ మేధావిగా ఎన్నో డిగ్రీలు సంపాదించి పేద వర్గాలకు కొరకు అహర్నిశలు పాటుపడిన వ్యక్తిని ఈరోజు గౌరవం మాకు దక్కిందంటే అది బాబా సాహెబ్ అంబేద్కర్ సాధించిన ప్రగతి అని, అంటరానితనాన్ని నిర్మూలించి సమానత్వాన్ని కల్పించిన మహానుభావుడని, ఆయన అందరి భవిష్యత్తులో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. 

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొప్పిశెట్టి వెంకటరమణ, మాజీ సర్పంచ్ రావిపాటి వెంకట గణేష్ చౌదరి, కార్యదర్శి సి వి సత్యనారాయణ, సిద్ధార్థ యూత్ గ్రామ పెద్దలు జన సైనికులు గ్రామస్తులు అందరు పాల్గొన్నారు.