డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, రామచంద్రపురం, బ్యూరో: పేదరికం లేని సమాజాన్ని నిర్మించి, సమ సమాజ స్థాపనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం అన్నారు. ప్రధానమంత్రి అనుసుచిత్ జాతీయ అభ్యుదయ యోజన పథకంలో (PMAJAY ) భాగంగా ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కాస్ట్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ వర్గానికి చెందిన మహిళలుకు జీవనోపాధి పొందు నిమిత్తం మంజూరైన చెక్కులు రూ.12 లక్షలను ఆయన గురువారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
నియోజవర్గంలోని కె. గంగవరం మండలంలో నలుగురు లబ్ధిదారులకు, రామచంద్రపురం మండలంలోని నలుగురు లబ్ధిదారులకు వెరసి 8 మంది మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ పేదరికం లేని సమాజం నిర్మించే దిశగా కృషి చేస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎస్సీ మహిళలకు జీవన ఉపాధి కల్పించడం ద్వారా వారి జీవన అభివృద్ధి మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని సత్యం అన్నారు.
ముఖ్యంగా స్వయం సహాయక సంఘాలలో ఉన్న ఎస్సీ మహిళలకు జీవనోపాధి కల్పించే దిశగా ప్రభుత్వాలు ఈ పథకం అమలు చేయటం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డిఎ ఏ పి యం అర్జున్, రామచంద్రపురం, కె. గంగవరం మండలాల మహిళా సంఘాల అధ్యక్షులు వి సూర్య కుమారి, గుత్తుల దుర్గాదేవి, కుక్కల సత్యవతి, పలువురు డ్వాక్రా యనిమేటర్లు తదితరులు పాల్గొన్నారు.