తాజా వార్తలు

10/recent/ticker-posts

భీమడోలులో రూపక దేవాలయం వద్ద వైసీపీ చర్యలకు నిరసనగా పూజలు – స్వామివారికి వినతిపత్రం


ఏలూరు జిల్లా, భీమడోలు: గతంలో తిరుమల లడ్డూల కల్తీ ఘటనతో పాటు, నిన్న రాష్ట్ర అసెంబ్లీలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటాన్ని చెప్పులతో పట్టుకుని నిరసన తెలియజేయడం, అనంతరం ఆ చిత్రపటాలను అవమానకరంగా విసరడం వంటి సంఘటనలను ఖండిస్తూ భీమడోలు జంక్షన్‌లోని రూపక దేవాలయం వద్ద కూటమి నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ హిందూ సంప్రదాయాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ విధమైన చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. భక్తుల మనోభావాలను కించపరిచే చర్యలు సమాజంలో ఉద్రిక్తతలకు దారి తీస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి, సామరస్య వాతావరణం నెలకొనాలని కోరుతూ స్వామివారికి వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ భీమడోలు మండల అధ్యక్షులు కరణం పెద్దిరాజు, ఏఎంసీ చైర్మన్ శేషాపు శేషగిరి, కనీస వేతన సవరణ బోర్డు డైరెక్టర్ దూసనపూడి పుల్లయ్య నాయుడు, గన్ని నాగ గోపాలరావు తదితర నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రవీణ్ కుమార్ పటేల్, తవ్వా చినబాబు మరియు కూటమి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

కార్యక్రమం ప్రశాంతంగా సాగగా, పాల్గొన్న నాయకులు హిందూ ఆచారాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.