Hot Posts

6/recent/ticker-posts

దేశ స్థితి, గతులను మార్చిన మహోన్నత వ్యక్తి అంబ్కేదర్.. -మంత్రి సుభాష్


డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, కె. గంగవరం, బ్యూరో: రాజ్యాంగ రచన ద్వారా దేశ స్థితి, గతులను మార్చిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్134వ జయంతి సందర్భంగా కే గంగవరం మండలం గంగవరం మెయిన్ రోడ్ లోను, సత్యవాడ, అముజూరు గ్రామంల్లో జరిగిన భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 

అనంతరం జరిగిన సమావేశాల్లో మంత్రి సుభాష్ మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, హక్కుల సాధనకు కృషి చేసిన చిరస్మరణీయడు అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగ రచనలో కీలకపాత్ర పోషించారని, ఆయన కృషి కారణంగానే ప్రపంచంలో భారతదేశం బలమైన ప్రజాస్వామ్యం దేశంగా ఆవిర్భవించిందని అన్నారు. అంబేద్కర్ అణగారిన వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేశారన్నారు. 

న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా పేరొందారన్నారు. స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ విధులు నిర్వర్తించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అంబేద్కర్ చిన్నతంలోనే అంటరానితనానికి గురయ్యారన్నారు. ఆనాడే ఆయన అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నారు. అంటరాని కులాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలపడితేనే వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వాధించిన మహానీయుడు అంబేద్కర్ అని మంత్రి సుభాష్ తెలిపారు. 

అంబేద్కర్ ముందు చూపు వల్లే నేడు అణగారిన వర్గాలు గౌరవ ప్రదమైన జీవనం సాగిస్తున్నాయన్నారు. అంబేద్కర్ జీవితం ఉద్యమాలకు, సాంఘిక సంస్కరణలకు ఊపిరిపోసిందన్నారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను గుర్తిస్తూ...1990లో అప్పటి భారత ప్రభుత్వం దేశ అత్యున్నత అవార్డు భారత రత్నను ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ రచన కారణంగానే భారతదేశం సురక్షితమైన పాలకుల చేతిలో ఉందన్నారు. 

నిరంకుశ పాలకుల కోరలను ఓటు అనే వజ్రాయుధంతో పీకే శక్తిని ప్రజలకు అంబేద్కర్ ఇచ్చారన్నారు. అంబేద్కర్ బాటలో నడుస్తున్న సీఎం చంద్రబాబునాయుడు సంక్షేమ ఫలాలు అర్హులకు అందాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాల అభ్యున్నతికి, పీ-4 కు శ్రీకారం చుట్టారని మంత్రి సుభాష్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్చార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.