ఏలూరు జిల్లా, చింతలపూడి: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అగ్ర నాయకులు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని భూమిలేని నిరుపేదలకు భూమి దక్కేంతవరకు పోరాడాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల గురవయ్య అన్నారు.
చండ్ర రాజేశ్వరరావు 31వ వర్ధంతి సందర్భంగా సిపిఐ ఆఫీసు నందు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కంచర్ల గురవయ్య మాట్లాడుతూ చంద్ర రాజేశ్వరరావు చిన్నతనం నుంచి విద్యార్థి దశలో ఉద్యమాలవైపు ఆకర్షతులై బెనారస్ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించి అక్కడి నుంచి విశాఖలో చదువుతూ ఆనాడే మతోన్మాద శక్తుల ఆగడాలను పసికట్టి మతోన్మాదులకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి.
విజయవాడ నగరంలో రౌడీముకల అల్లర్లను అరికట్టడానికి విజయవాడ నగరంలో ఉన్న యువకులను సేకరించి వారికి జన సేవాదళ్ ద్వారా శిక్షణ ఇచ్చి రౌడీ లను విజయవాడ నగరం నుంచి తరిమికొట్టిన వ్యక్తి చండ్ర రాజేశ్వరరావు అని అన్నారు. అడవి బంజరులుపై హక్కు కావాలని వాటిని పేదవాడికి పంచాలని ఆనాటి పశ్చిమగోదావరి జిల్లా ఫారెస్ట్ ఆఫీసును ముట్టడించి అక్కడే 48 గంటలు దీక్ష వల్ల ఈనాడు ఏర్పడిన వి ఎస్ ఎస్ లు రాజేశ్వరరావు పోరాట ఫలితమే అని అన్నారు.
ఈవర్ధంతి కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి తోర్లపాటి బాబు, సహాయ కార్యదర్శి దంతా కృష్ణ, మండల కమిటీ సభ్యులు ఎస్కే కాలేశా, కౌన్సిల్ సభ్యులు తాడిగడప మాణిక్యాలరావు, చేపల్లి శ్రీనివాసరావు, ఎస్.కె మస్తాన్ ఎస్కే లాల్ బి.ఐఫ్ జిల్లా కోకన్వీనర్ తోర్లపాటి రాజు రామకృష్ణ మొగల శ్రీను తదితరులు పాల్గొన్నారు.