Hot Posts

6/recent/ticker-posts

వేసవి సెలవులకు ఊరు వదిలి ఇతర గ్రామాలకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలి: ఎస్సై షేక్ జానీ భాషా


డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, కే గంగ వరం, బ్యూరో: స్థానిక పోలీస్ స్టేషన్ లో పామర్రు ఎస్సై షేక్ జానీ భాషా మాట్లాడుతూ వేసవి కాలం కారణంగా దొంగతనాలు ఎక్కువగా జరుగుచున్నందున ఇల్లు వదిలి వేరే ప్రాంతాలకు వెళ్ళే ఆయా గ్రామాల వాసులు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఊళ్లకు వెళ్లే వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు

*గ్రామాలు దాటి వెళ్లే కుటుంబాలు మీ యొక్క విలువైన బంగారు, వెండి, నగదును సాధ్యమైనంత వరకు బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవలెను. 

*వేసవి సెలవులు సందర్భంగా ఇల్లు వదిలి అందరూ వెళ్ళిపోకుండా ఎవరో ఒకరు ఇంట్లో ఉండే విధంగా చూసుకోవాలని, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఇండ్లకు తాళంవేసి ఊరికి వెళ్లేవారు పోలీసుస్టేషన్ లో సమాచారం ఇవ్వవలెను.

*దొంగతనాలు జరగకుండా గస్తీ పోలీసులు ఆయా ప్రాంతాలలో రాత్రి వేళ ప్రత్యేక నిఘా ఉంచుతామని తెలిపారు. కొందరు తమ బ్యాంకుల్లో నగదు, బంగారు, ఇతర ఆభరణాలను ఉంచుకుని బస్సుల్లో ఇతర వాహనాలలో ప్రయాణం చేసే సమయంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. కావున తగిన జాగ్రత్తలు పాటించవలెను.

*వేసవికాలం కారణంగా ఇంట్లో విలువైన వస్తువులు వదిలి మేడ పైకి వెళ్లి పడుకోవడం, ఆరుబయట నిద్రించడం చేయరాదు. ఆరుబయట, మేడపైన నిద్రించేవారు మీ యొక్క సెల్ ఫోన్ లను ప్రక్కన పెట్టుకుని పడుకోవడం వల్ల మీ యొక్క సెల్ ఫోన్ లు దొంగతనం జరిగే ప్రమాదం ఉన్నది.

*ప్రస్తుతం గ్రామాలలో జాతరలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో గుడిలో ఉండే హుండీలలో గల నగదును కమిటీ వాళ్ళు ఎప్పటికప్పుడు భద్రపరుచుకోవలెను.
  
*మీమీ గ్రామాలలో పగటివేళలో గాని రాత్రి వేళలో గాని ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్న యెడల వారిని గుర్తించి వెంటనే 112 కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం తెలియపరచవలెను.