Hot Posts

6/recent/ticker-posts

పదవీ విరమణ చేస్తున్న పశు సంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ కు సత్కారం..


ఏలూరు: విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా సేవలు అందించి ఈనెల 31న పదవీ విరమణ చేస్తున్న పశు సంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ డా. జి. నెహ్రూబాబును కలెక్టర్ వెట్రిసెల్వి అబినందించారు.  సోమవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డా. జి. నెహ్రూబాబును జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రి రెడ్డిలు శాలువతో సత్కరించి జ్ఞాపికను అందించి అభినందించారు. 

పశు సంవర్ధక శాఖ ద్వారా పశు పోషకులకు అందుబాటులో ఉంటూ పశువులకు అవసరమైన వైద్యసేవలు అందించడంతోపాటు పాడి పరిశ్రమ అభివృద్ధి, ఇతర సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేశారన్నారు.  వారి 39 సంవత్సరాల నిర్విరామ సేవలను తోటి అధికారులు స్పూర్తిగా తీసుకోవాలన్నారు.  సమావేశంలో డిఆర్డిఏ పిడి డా. ఆర్. విజయరాజు, ఆర్ అండ్ బి ఎస్ఇ జాన్ మోషే, జిల్లా వ్యవసాయశాఖ అధికారి షేక్ హబీబ్ భాషా, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎన్.ఎస్. కృపావరం, పదవీ విరమణ చేస్తున్న పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డా. జి. నెహ్రూబాబు విధి నిర్వహణలో అంకితభావాన్ని కొనియాడారు.  

కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు యం. ముక్కంటి, కె. భాస్కర్, జెడ్పి సిఇఓ కె. సుబ్బారావు, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.