మెర్లపాలెం రహదారిపై రోడ్డు ప్రమాద బాధితునికి అండగా నిలిచిన ఎమ్మెల్యే
గాయపడిన వ్యక్తిని తన కారులో దగ్గరుండి ఆసుపత్రికి తరలించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు
మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే సత్యానందరావు
మెర్లపాలెం వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీకొన్న కారు
ప్రమాదాన్ని గమనించి తన వాహనాన్ని ఆపి గాయపడిన వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే
బాధితుడిని తన వాహనంలో ఎక్కించి హుటాహుటిన ఊబలంక ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మెర్లపాలెం బి సి ఎన్ న్యూస్: జిల్లాలోని రావులపాలెం - బొబ్బర్లంక రహదారిలో మెర్లపాలెం వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని అటుగా వెళ్తున్న కారు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదాన్ని గమనించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు తన వాహనాన్ని ఆపి గాయపడిన వ్యక్తిని పరామర్శించి ధైర్యం చెప్పి అండగా నిలిచారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
ప్రమాద బాధితుడిని తన వాహనంలో ఎక్కించి హుటాహుటిన ఊబలంక ఆసుపత్రికి తరలించారు. ప్రమాద బాధితుడు ఉన్న కారు బయలుదేరిన అనంతరం ఊబలంక ప్రాథమిక ఆసుపత్రి వైద్యులతో ఫోన్ లో మాట్లాడి ప్రమాద వివరాలు తెలిపి గాయపడిన వ్యక్తికి తక్షణ వైద్యం అందించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి అండగా నిలబడి వైద్య చికిత్సకు దగ్గరుండి ఏర్పాట్లు చేయడంపై సత్యానందరావు ఉదార స్వభావానికి అందరూ ప్రశంసలు కురిపించారు.