Hot Posts

6/recent/ticker-posts

చింతలపూడి వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ అసిస్టెంట్లు కావాలి..పీ.హెచ్.సీ లకు రావాలి!!



చింతలపూడి/ ఏలూరు జిల్లా: చింతలపూడి వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ అసిస్టెంట్లు కావాలి..పీ.హెచ్.సీ లకు రావాలి!! అని ముక్తకంఠంతో పీ.హెచ్.సీ ఉద్యోగులు నినదించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అన్ని విధాలుగా ఆయువుపట్టుగా ఉన్న మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని వైద్య ఉద్యోగులందరూ ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. 

రాఘవపురం పీ.హెచ్.సీ ఆవరణలో శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో 'వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ అసిస్టెంట్లు కావాలి.. పీ.హెచ్.సీ లకు రావాలి!' నినాదంతో జరిగిన కార్యక్రమంలో వైద్య ఉద్యోగులందరూ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పీ.హెచ్.సీ డాక్టర్స్ అసోసియేషన్ మద్దతుతో వైద్య ఉద్యోగులందరి సంయుక్త సహాకారంతో జరిగిన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ, కోవిడ్ వంటి ప్రళయంలో ప్రాణాలకు తెగించి సేవలు చేయండంలోనూ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో అంటువ్యాధులు ప్రభలకుండా తక్షణ సేవల్లోను, అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులోనూ హెల్త్ అసిస్టెంట్ల పాత్ర ప్రధానమైందన్నారు. 

ప్రజారోగ్య పరిరక్షణ కోసమే కాకుండా అందరికీ ఆరోగ్యాన్ని అందించే ప్రాధమిక వైద్యాలయాల్లో అన్ని విధాల సహాయకులుగా హెల్త్ అసిస్టెంట్లు కీలక భూమిక పోషిస్తున్నారన్నారు. ఇలా ఎన్నో విధాలుగా గ్రామీణ స్థాయిలో ఆరోగ్య రంగానికి మూల స్థంభాలైన హెల్త్ అసిస్టెంట్లను కోర్టు ఆదేశాల సాకుతో ఒక్కసారిగా గొంతు కోసి ఉన్నపళంగా ఉద్యోగాల నుంచి తీసివేసి నట్టేట ముంచేయడం తీవ్ర అన్యాయమన్నారు. ఇరవై రెండేళ్ల పాటు సుధీర్ఘ సర్వీస్ చేసి 50 ఏళ్ళు దాటిన వయస్సులో ఉద్యోగం నుంచి బయటకు గెంటెస్తే ఆ ఉద్యోగులపై ఆధారపడ్డ కుటుంబాలు బ్రతికేదెలా అని ప్రశ్నించారు. 

వారికి ఆత్మహత్యలు తప్ప వేరే మార్గం లేదని బాధిత హెల్త్ అసిస్టెంట్లు ఈ కార్యక్రమంలో కన్నీరు మున్నీరవ్వడం పట్ల వైద్య ఉద్యోగులందరూ తీవ్రంగా స్పందించారు. తక్షణమే ప్రభుత్వం కలగజేసుకుని తొలగించిన హెల్త్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు పీ.హెచ్.సి ల నుంచి మెయిల్ ద్వారా సమాచారంతో ఉద్యోగులందరూ కోరారు. ఈ సందర్భంగా వినతి పత్రాన్ని పి హెచ్ సి వైద్యాధికారి డాక్టర్ కిరణ్ చైతన్య, డాక్టర్ దొరసనమ్మ, సి హెచ్ వో పి. రవి కుమార్, లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ లు షేక్ షాజహాన్, ఎస్. గోపి కిషోర్, కె. శ్రీనివాసరావు,ఆశా వర్కర్స్ పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి..