Hot Posts

6/recent/ticker-posts

ఆలమూరులో జనసేన నాయకులు సందడి


పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారోత్సవం..  
ఆలమూరులో బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయోత్సవాలు.. భారీ బాణసంచ కాల్పులు సందడి..

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు జేజేలు పలుకుతూ కొత్తపేట నియోజకవర్గం ఆలమూరులో జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ కార్యాలయం వద్ద విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. 

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భారీ భాను సంచాలను పేల్చారు. జై జనసేన జై పవన్ కళ్యాణ్, జై బండారు శ్రీనివాస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం జనసేన పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వంగవీటి మోహనరంగా విగ్రహం వద్దకు చేరుకుని బాణసంచాలు పేల్చి కేక్ కట్ చేశారు. స్వర్గీయ వంగవీటి రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Staff Reporter 
Vijaya Babu I
Konaseema District

WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now