Hot Posts

6/recent/ticker-posts

YSRCP : వరాలకు మరింత సొబగులు.. అదనపు రూకలు.. ఇదీ వైసీపీ మ్యానిఫేస్టో


వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ 2024 ఎన్నికలకు సంబంధించి మ్యానిఫేస్టోను విడుదల చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మ్యానిఫేస్టోను విడుదల చేశారు. కేవలం రెండు పేజీలతో మ్యానిఫేస్టో విడుదల చేశారు. ఇప్పుడున్న పథకాలను కొనసాగిస్తూనే వాటికి కొంత నగదును జోడిస్తూ మ్యానిఫేస్టోలో చోటు కల్పించారు. ప్రస్తుతం వైసీసీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. దానికి ముందు చెప్పిన తేదీలకే నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తూ వచ్చింది. కరోనా వంటి క్లిష్టమైన సమయంలోనూ లబ్దిదారులకు నగదు బదిలీ మాత్రం ఆపలేదు. ఆ నమ్మకంతోనే ఇప్పుడు కొనసాగుతున్న పథకాలను అప్ గ్రేడ్ చేస్తూ మ్యానిఫేస్టోను రూపొందించింది. ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలకు అదనంగా కొంత మొత్తాన్ని జోడించింది. దీంతో పాటు ఇప్పుడున్న పథకాలకు తోడు మరికొన్నింటిని జోడించారు. 2019 మ్యానిఫేస్టోలో చెప్పినవన్నింటినీ అమలు చేశామన్నారు.


జగన్ ఏమన్నారంటే...? 
2019లో ఇచ్చిన వాగ్దానాలను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి అమలు చేశామన్నారు. ఈ మ్యానిఫేస్టోను ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉంచి మరీ అమలు చేశామని చెప్పారు. తొలిసారిగా ఈ ప్రభుత్వ హయాంలో మ్యానిఫేస్టోకు ప్రాధాన్యత వచ్చిందన్నారు. మ్యానిఫేస్టోను పవిత్ర గ్రంధంగా భావించామని చెప్పారు. నవరత్నాల పాలనకు ఈ మ్యానిఫేస్టో అద్దంపడుతుందని జగన్ తెలిపారు. 2.75 లక్షల కోట్లు నేరుగా ఇచ్చామన్నారు. ఇది ఒక హిస్టరీ అని అన్నారు. పేదల ఆత్మగౌరవాన్ని, అవ్వాతాతల ఆత్మాభిమానాన్ని ఎరిగిన వాడిగా పథకాలన్నింటినీ డోర్ డెలివరీ చేశానని తెలిపారు. 2019లో మ్యానిఫేస్లో అమలు చేయడం సాధ్యమేనా అని కొందరు తనను ప్రశ్నించారన్నారు. అయినా 99 శాతం మ్యానిఫేస్టోలో అంశాలను అమలు చేశామని తెలిపారు. 2014లో రైతు రుణమాఫీ చేయాలని తనపై వత్తిడి చేసినా తాను అందుకు అంగీకరించలేదన్నారు. చేయగలివినవి మాత్రమే చెప్పానన్నారు.

తాను చూసిన వాటిని... 
2014లో అధికారంలోకి రాలేకపోయినా.. ఈరోజు మ్యానిఫేస్టోలో చెప్పినట్లు చేసి చూపించి ఈరోజు ప్రజల్లోకి వెళుతున్నానని అన్నారు. రాజకీయాల్లో ప్రజలకు మాట ఇస్తే నమ్ముతారని, ఆ ఆశతోనే ఓటేస్తారన్నారు. ఆ ఓటు వేసినప్పుడు ఆ నమ్మకం నెరవేర్చాల్సిన బాధ్యత ఉందన్నారు. వారినమ్మకంతో ఆడుకోవడం సబబా? అని ఆయన ప్రశ్నించారు. అప్పుడే నాయకత్వాన్ని జనం విశ్వసిస్తారన్నారు. పేదల పరిస్థితి ఎలా ఉంది అని తన పాదయాత్రలో కళ్లారా చూశానని అన్నారు. పిల్లలను చదివించలేని పరిస్థితి చూశానని, ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితిని చూశానని అన్నారు. అవ్వాతాతలకు అన్ని అర్హతలున్నా పింఛను ఇవ్వని పరిస్థితి ఉందన్నారు. ప్రతి విషయంలో లంచం, వివక్ష ఉందని అన్నారు. రాజకీయ నేతల సృష్టించిన సమస్యలేనని జగన్ అన్నారు. ఈ వ్యవస్థ ను బాగుపర్చాలన్న ఉద్దేశ్యంతోనే తాను మొదటి నుంచి ఈరోజు వరకూ అడుగులు వేశానన్నారు.

వాటి అమలు సాధ్యమేనా? 
చంద్రబాబు చెప్పే హామీలు చేయాలంటే 1.20 లక్షల కోట్ల రూపాయలు ఏటా కావాలన్నారు. వీటికి తోడు తమ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను కూడా కలిపితే 1.50 లక్షల కోట్ల రూపాయలను ఖర్చుచేయాల్సి ఉంటుందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినా వీటిని అమలు చేయడం సాధ్యమేనా? అని ఆయన ప్రశ్నించారు. హిస్టరీ రిపీట్స్ అన్నట్లు మళ్లీ 2014 తరహాలోనే సాధ్యంకాని హామీలతో అబద్ధాలకు రెక్కలు గడుతూ జనం ముందుకు వస్తున్నారన్నారు. ఇది దొంగతనం కంటే అన్యాయం కాదా? అని జగన్ ప్రశ్నించారు. మాట ఇస్తే అమలుచేసేటట్లు నాయకుడు ఉండాలన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న పథ్నాలుగు ఏళ్లు కూడా రెవెన్యూ లోటు ఉందన్నారు.

మ్యానిఫేస్టో ఇలా... 
పెన్షన్ 3,500 రూపాయల పెంపుదల 
మహిళలకు సంబంధించి వైెఎస్సార్ చేయూత : 75,000 - 1,50,000 
వైెఎస్సార్ కాపు నేస్తం : 60,000, 1,20,000 
వైఎస్సార్ ఈబీసీ నేస్తం : 45,,000 - 1,05,000 
అమ్మవొడి : 15,000 - 17,000 
వైఎస్సార్ ఆసరా : మూడు లక్షల వరకూ సున్నా వడ్డీ పై రుణాలు అందిస్తాం 
రైతు భరోసా : 67, 500 - 80,౦౦౦ 
మత్య్సకార భరోసా : 50,000 - 1,00,000 
వాహనమిత్ర 50,000 - 1,00,000
WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now