Hot Posts

6/recent/ticker-posts

జర్నలిస్ట్ ల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.. క్రీడలతో మానసిక ప్రశాంతత


Visakhapatnam మహారాణి పేట: విశాఖ జర్నలిస్ట్ ల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను శుక్రవారం సింహాచలం దేవస్థానం ధర్మ కర్తల మండలి సభ్యులు, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయము సలహా మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఆంధ్ర మెడికల్ కళాశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమములో గంట్ల శ్రీనుబాబు పాల్గొని మాట్లాడుతూ.. నిరంతరం పని ఒత్తిడితో ఉండే జర్నలిస్టులకు ఇటువంటి క్రీడా పోటీలు వల్ల శారీరక దేహదారుడ్యము, మానసిక ప్రశాంతత కలుగుతుంది అన్నారు.


ఎప్పటికప్పుడు పరవాడ, గాజువాక గోపాలపట్నం, పెందుర్తి, విశాఖపట్నంలో ఈ టోర్నమెంట్ లు నిర్వహించడం వల్ల అనేకమందికి క్రికెట్ ఆడే అవకాశం కలుగుతుంది అన్నారు. జర్నలిస్టులకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. గౌరవ అతిథిగా హాజరైన జెసాప్ సంయుక్త కార్యదర్శి వాల్మీకి నాగరాజు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా తాను అనేక టోర్నమెంట్లు నిర్వహించానన్నారు. భవిష్యత్తులో ఈ అసోసియేషన్ ద్వారా మెగా టోర్నమెంట్ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. విశాఖ జర్నలిస్టుల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ రామకృష్ణ, కార్యదర్శి అనిల్, పలువురు సభ్యులు క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసేపు బ్యాటింగ్ చేసి శ్రీనుబాబు క్రీడాకారులను ఉత్సాహపరిచారు.