కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం: దివంగత నేత, స్వర్గీయ వరుపుల రాజా ప్రధమ వర్ధంతి సందర్బంగా వారి సతీమణి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ ప్రత్తిపాడు మండలం పెద శంకర్లపూడిలో భర్త రాజా ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి రాజాకి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ప్రత్తిపాడులో రాజా అభిమానులు ఏర్పాటు చేసిన రాజా విగ్రహాని మాజీ మంత్రి వర్యులు నిమ్మకాయల చిన రాజప్ప, సుజయ్ కృష్ణ రంగారావు, యనమల కృష్ణుడు, సాన సతీష్, నియోజకవర్గ ఇంచార్జ్ వరుపుల సత్య ప్రభ రాజా ఆవిష్కరించారు.
అనంతరం మెగా వైద్య శిబిరాన్ని సత్య ప్రభ రాజా ప్రారంభం చేసారు. 1000 మంది పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసారు. పేదలకు వస్త్రాలు పంపిణీ చేసారు. 20 వేల మందికి అన్నదానం చేసారు. అనంతరం జరిగిన రాజా సంస్మరణ సభలో పలువురు రాజా సేవలు, రాజాతో వారికి ఉన్న అనుబంధం గుర్తు తెచ్చుకొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నిమ్మకాయల చిన రాజప్ప, సుజయ్ కృష్ణ రంగారావు, నల్లమిల్లి రామ కృష్ణా రెడ్డి, సానా సతీష్, యనమల కృష్ణుడు, తోట నవీన్, వరుపుల తమ్మయ్య బాబు, తుమ్మల బాబు, సుంకర పావని, వత్సవాయి సూర్యనారాయణ, మరియు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.