Hot Posts

6/recent/ticker-posts

వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలన దినోత్సవం.. జిల్లా న్యాయ సేవ సంస్థ నుండి ఫైర్ స్టేషన్ వరకు అవగాహన ర్యాలీ


 ఏలూరు: జిల్లాలోని కార్మిక అనుబంధ శాఖల సహకారంతో వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవ సంస్థ నుండి ఫైర్ స్టేషన్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించడమైనదని ఉప కార్మిక కమీషనర్ పి. శ్రీనివాస్ తెలిపారు.  
తదుపరి వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలనపై ప్రతిజ్ఞ చేసారు.

ఈ సందర్బంగా జిల్లా న్యాయ సేవ సంస్థ సెక్రెటరీ కె. రత్న ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో వెట్టి చాకిరీ నిర్మూలన కోసం తమవంతుగా అందరూ కృషి చేయాలని, వెట్టి చాకిరీ అనేది చట్ట రీత్యా నేరం మరియు సాంఘిక దురాచారం అని తెలుపుతూ ఏటువంటి నిర్బంధం లేకుండా కార్మికులు స్వేచ్చగా పనిచేసుకునేందుకు యజమానులు తగిన అవకాశం కల్పించాలన్నారు. వెట్టి చాకిరీ వ్యవస్థ రహిత జిల్లాగా ఏలూరును చేయడానికి సమాజంలోని అందరూ సహరించాలన్నారు. 

ఉప కార్మిక కమీషనర్ పి. శ్రీనివాస్, ఈసదస్సుకు హాజరైన వారితో వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలన కొరకు అందరూ కృషిచేయాలని ప్రతిజ్ణ చేయించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు, కార్మికులు, కార్మిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, వెట్టి చాకిరీ, బాల కార్మికులు ఎక్కడైనా పని చేయుచున్నట్లైతే వారిని గుర్తించి సంబందిత రెవెన్యూ, పోలీసు, కార్మిక శాఖ ల దృష్టికి తీసుకువచ్చీ వారి విముక్తి కొరకు తమ వంతు సహకారం అంధించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ సంస్థ, ఏలూరు నందు జరిగిన అవగాహన కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ సంస్థ సెక్రెటరీ కె. రత్న ప్రసాద్, సహాయ కార్మిక కమీషనర్ జి.నాగేశ్వర రావు, సబ్ ఇన్స్పక్టర్, దిశ పోలీస్ స్టేషన్, క్రాంతి ప్రియ, డీసీపీవో, సూర్యచక్రవేణి, ఫ్యాక్టరీలు ఇన్స్పెక్టర్ ఏ .శ్రీనివాస్, సమగ్ర శిక్ష కో ఆర్డినేటర్, రాధాకృష్ణ ప్యానల్ లాయర్ కె కృష్ణారావు, కార్మిక శాఖ అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.