చింతలపూడి పట్టణంలో మంగళవారం మార్కెట్ యార్డ్ చైర్మన్ జగ్గవరపు జానకి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు పార్లమెంట్ వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్, చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయ రాజు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి సునీల్, ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు ఆసరా పథకం ద్వారా లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ పథకాలను రూపొందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. ఈ సందర్భంగా వారు ఇరువురు రాబోయే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో తమను మహిళలందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించి జగనన్నకు కానుకగా ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎంపీపీ డాక్టర్ రాంబాబు, జడ్పిటిసి నీరజ, మండల సచివాలయాల కన్వీనర్ టి శ్రీనివాసరావు, చింతలపూడి పట్టణ సచివాలయాల కన్వీనర్ నిమ్మగడ్డ దుర్గారావు, చింతలపూడి పట్టణ వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు కొప్పుల నాగేశ్వరరావు, నాయకులు మిరియాల దిలీప్ తదితరులు పాల్గొన్నారు.