మంగళవారం ఉదయం ఇండిగో విమానం హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చింది. ఈ సమయంలో... గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఇండిగో విమానాన్ని లాండింగ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించగా... టేకాఫ్ సమయంలో విమానం చక్రాలు ఉన్న ప్యానెల్ తెరుచుకోలేదు. దీనికోసం రెండు సార్లు ప్రయత్నించినా.. వీల్ ప్యానెల్ ఓపెన్ కాలేదు. దీంతో... పైలట్ విమానాన్ని మళ్లీ పైకి లేపాడు. ఈ సమయంలో... ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏ.టీ.సీ.) కు సమాచారం ఇవ్వడంతో పాటు ప్రయాణీకులకు కూడా పరిస్థితిని వివరించాడు. ఈ క్రమంలో సుమారు 20 నిమిషాల పాటు విమానాన్ని గాల్లోనే తిప్పుతూ.. వీల్ ప్యానెల్ ను చెక్ చేసుకున్న పైలెట్... అంతా ఓకే అయిన అనంతరం విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు సుమారు 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో కొంతమంది మనస్తాపంతో చనిపోయారని ప్రచారం జరగడం.. ఆ కుటుంబాలను పరామర్శిస్తానని భువనేశ్వరీ రెండు రోజులు పర్యటించడం తెలిసిందే. అయితే ఆ కార్యక్రమం నాడు ఆపేసిన భువనేశ్వరి... తాజాగా చేపట్టారు. ఇందులో భాగంగా నేటినుంచి బాపట్ల, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో ఆమె పర్యటించనున్నారు. ఏది ఏమైనా... ఆమె ప్రయాణిస్తున్న విమానం సేఫ్ గా ల్యాండ్ అవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు!