డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండల జొన్నాడ మరియు మూలస్థానం రెవెన్యూ పరిధిలో గల డి పట్టా భూములు మరియు ఎక్ సాల్ లీజ్ పట్టా, ప్రభుత్వ భూములలో రాత్రి సమయాలలో మట్టి మరియు బొండు ఇసుకను మూలస్థానం గ్రామానికి చెందిన మట్టి బ్రోకర్లు తోట శ్రీను, అంబటి నాగరాజు సన్నాఫ్ సామురు మరియు కొంతమంది వ్యక్తులు కలిసి రాత్రి సమయాలలో మట్టిని అక్రమంగా ప్రోక్లైన్లతో తవ్వి ట్రాక్టర్లు, లారీలతో ఇటుక బట్టీలకు తరలించకపోతున్నారు.
ఈ తవ్వకాల వలన ప్రభుత్వ ఆదాయానికి గండిపడటమే కాకుండా పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం ముఖ్యంగా ప్రజల జీవనాధారమైన అసైన్డ్ భూములు పట్టా భూములు గోదావరి వరదల సమయాలలో కొట్టుకుపోయే ప్రమాదం ఉందినీ, అక్రమమట్టి తవ్వకాలు జరుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ మట్టి తవ్వకాలను వెంటనే నిలుపుదల చేయవలసిందిగా కోరుచున్నామని గంటా మనోహర్ దాసు, జొన్నాడ గ్రామ సర్పంచ్ కట్టా శ్రీనులు స్పందన కార్యక్రమంలో పాల్గొని వినతి పత్రాన్ని మండల రెవెన్యూ ఆఫీసర్ ఐపీ శెట్టి కి అందజేశారు.