ఏలూరు: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల పరిధిలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని రెండవ జిల్లా జడ్జి శ్రీమతి పి. మంగాకుమారి శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు జాతీయ లోక్ అదాలత్ ఉద్దేశించి ఏర్పాటుచేసిన సమావేశంలో తెలియజేశారు.
ఈ జాతీయ లోక్ అదాలత్ లో అన్ని రకాల రాజీయోగ్యమైన క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు మరియు వాహన ప్రమాద భీమా కేసులను, పరిష్కరించుకోవచ్చని కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అలాగే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందించే ఉచిత సేవలను వినియోగించుకోవాలని తెలియజేశారు.
జాతీయ లోక్ అదాలత్ నందు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 139 సివిల్ కేసులు, 111 వాహన ప్రమాద బీమా కేసులను రాజీ చేయడం జరిగిందని తద్వారా 7 కోట్ల 37 లక్షల 35 వేల రూపాయలను పరిహారంగా చెల్లించడం జరుగుతుందని, 1572 క్రిమినల్ కేసులు 135 ప్రీ లిటిగేషన్ కేసులను మొత్తం కేసులను పరిష్కరించారని తెలియజేశారు.
అలాగే ఉదయం జరిగిన సమావేశము నందు పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్పర్సన్ ఏ మేరీ గ్రేస్ కుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. రత్న ప్రసాద్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ కె. కె. వి బులి కృష్ణ ఇతర న్యాయమూర్తులు ఏలూరు బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పి.డి.ప్రసాద్ ప్రభుత్వ న్యాయవాది బి. జె. రెడ్డి, పి.పి కోనే సీతారాం మొదలైన వారు పాల్గొన్నారు.