రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ శాతం పెంచే దిశగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా స్వీప్ నోడల్ అధికారి ,హౌసింగ్ పీడీ కె రవి కుమార్ చెప్పారు. ఏలూరు ఆర్డీవో ఎన్ ఎస్ కె ఖజావలి అధ్యక్షతన మంగళవారం ఉంగుటూరు మండలం నారాయణపురం శ్రీ అరవింద శతజయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో, విద్యార్థులచే "ఎలక్టరల్ లిటరసీ క్లబ్" నిర్వహణ నిమిత్తం వారికి అవగాహన సదస్సు జరిగింది.
ఈ సందర్బంగా జిల్లా స్వీప్ నోడల్ అధికారి ,హౌసింగ్ పీడీ కె రవి కుమార్ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు పొందడమే కాకుండా ఓటు వినియోగానికి 'క్రమబద్ధమైన ఓటర్ల విద్య, ఎన్నికల భాగస్వామ్యం (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ స్వీప్)'లో భాగంగా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వె.ప్రసన్న వెంకటేష్ వారీ ఆదేశాల మేరకు జిల్లా వివిధ కార్యక్రమాలు చేపట్టమన్నరు.
ఏలూరు ఆర్డీవో ఎన్ ఎస్ కె ఖజావలి మాట్లాడుతు యువ ఓటర్లు ఓటు హక్కు పొందడమే కాకుండా ఓటు హక్కు వినియోగంచుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇవియం తదితర ఓటింగ్ యంత్రాల ద్వారా ఓటు హక్కు ఏ విధంగా వినియోగించుకోవాలో విద్యార్థులకు వివరించారు. ఓటర్ల చైతన్య కార్యక్రమం పై చైతన్యం నిమిత్తము స్వీప్ కు సంబంధించిన ముగ్గులు చేబ్రోలు వి.ఆర్.ఏ. సుబ్బలక్ష్మి వేశారు.
తహశీల్దార్ కె.వి.రమణారావు, డిగ్రీ మరియు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ , విద్యార్ధులు,ఎన్నికల డి.టి.,ఎన్నికల సీనియర్ అసిస్టెంట్, నారాయణపురం పంచాయతీ కార్యదర్శి, వి ఆర్ విలు బి ఎల్ వో లు పాల్గొన్నారు.