Hot Posts

6/recent/ticker-posts

గ్రామీణ డాక్ సేవ సేవకులు సమ్మె నేటికి నాల్గవ రోజు


దేశ వ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవ సేవకులు సమ్మె నిర్వహిస్తున్న సందర్భంగా జంగారెడ్డిగూడెం హెడ్ పోస్ట్ ముందు ఏలూరు డివిజన్ పరిధిలోని గ్రామీణ డాక్ సేవకులు నేటికి నాల్గవ రోజు సమ్మె నిర్వహించడం జరిగింది. కమలేష్ చంద్ర ఇచ్చిన రిపోర్టులోని అంశాలను సానుకూలంగా అమలు పరచాలని కేంద్రం ప్రభుత్వాని డిమాండ్ చేయడం జరిగింది. జంగారెడ్డిగూడెం హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ర్యాలీగా మసీద్ సెంటర్ వరకు వెళ్ళి అక్కడ మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏ ఐ జి డి ఎస్ యు ప్రెసిడెంట్ ఎం నాగేశ్వరావు సెక్రెటరీ ఎస్ఎస్ బాజీ మాట్లాడుతూ 


జీడీఎస్ సమస్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పలు డిమాండ్లను వివరించారు. కమలేష్ చంద్ర ఇచ్చిన రిపోర్టులోని సానుకూల అంశాలు అమలు పరచాలని, గ్రామీణ డాక్ సేవకుల అందరకి సివిల్ స్టేటస్ హోదా కల్పించాలని, 12, 24, 36 సంవత్సరాలకు అదనపు సర్వీస్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ ఐదు లక్షలు మరియు గ్రాడ్యూటీ అయిదు లక్షలు రూపాయలు పెంచాలని, 180 రోజులు వరకు సెలవులను దాచుకున్న వారికి నగదుగా మార్చుకునే సౌకర్యం కల్పించాలని, కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యాలు కల్పించాలని, జిడిఎస్ కాంట్రిబ్యూషన్ 10 శాతం డిపార్ట్మెంట్ కంట్రిబ్యూషన్ 10 శాతం ఇవ్వాలని, అలాగే తాత్కాలిక పెన్షన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.


ప్రభుత్వం సమస్యలన్నీ అంగీకరించే వరకు జె సి ఎ పిలుపుమేరకు నిరవధికే సమ్మె చేస్తామని వారు తెలిపారు. ఆ తరువాత మెయిన్ సెంటర్ నుంచి బస్టాండ్ మీదుగా నినాదాలు చేస్తూ ర్యాలీగా హెడ్ పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళారు.


ఈ కార్యక్రమంలో ట్రెజరర్ ఎం దుర్గా వరప్రసాద్, దర్భ గూడెం బిపిఎం పి.దుర్గారావు, టీ నర్సాపురం ఎన్.దుర్గారావు, ఏలూరు డివిజన్ పరిధిలో గల గ్రామీణ డాక్ సేవకులు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొన్నారు.


Repoter
T. Venkanna Babu
Jangareddy Gudem
WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now