ఏలూరు జిల్లా: నూజివీడు లో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అసైన్డు, లంక భూముల రైతులకు పట్టాలు పంపిణీ చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రసంగం సభికులను ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ సువిశాల వ్యవసాయ క్షేత్రం కలిగిన ఏలూరు జిల్లాలో వ్యవసాయ రంగానికి సహకారం అందిస్తూ.. వైద్య విద్య కోసం మెడికల్ కాలేజీ స్థాపించి జనహృదయ నేతగా గౌరవ ముఖ్యమంత్రి గుర్తింపు సాధించారని, కులం, మతం వంటి వాటితో సంబంధం లేకుండా అందరికీ విద్య, ఆరోగ్యం, సంక్షేమం కోసం అందరి అభివృద్ధి లక్ష్యంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. .
పేదల జీవితాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని, ఏలూరు జిల్లాలో భూమిలేని 752 మంది పేదవారికి 693.25 ఎకరాల భూమిని పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో 13,077 మందికి చెందిన 16,446 ఎకరాలను భూముల రిజిస్ట్రేషన్ చట్టం యొక్క నిషేధిత రిజిస్టర్ 22 ఏ సెక్షన్ నుండి తొలగించడం ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు. నిరుపేద రైతులకు వారి భూములపై శాశ్వత హక్కు కల్పించడం వారి ఆత్మగౌరవాన్ని పెంచడమేనన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న గొప్ప నిర్ణయంతో ఎన్నో దశాబ్దాలుగా పరిష్కారం కానీ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తున్నది కలెక్టర్ చెప్పారు.
ఎస్సీ సామాజిక వర్గం వారికి ప్రత్యేకంగా స్మశాన వాటికల కోసం 31 గ్రామాలకు 33.32 ఎకరాలు ఆయా గ్రామపంచాయతీలకు అందించడం జరిగిందన్నారు. స్వామిత్ర- వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూ రక్ష పథకం ద్వారా జిల్లాలో ఆరు గ్రామాలు ఆర్ వో ఆర్ పూర్తయి.. యాజమాన్య పత్రాల జారీ జరగబోతోంది. జిల్లాలో పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టి మన జిల్లాను ప్రగతి పథంలో ముందుకు తీసుకు వెళుతున్న మన జిల్లా ప్రజాప్రతినిధులు ద్వారా సహాయ సహకారాలు అందిస్తూ మార్గనిర్దేశం చేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలియజేసారు. .
ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ,రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత , సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎంపీలు మిదున్ రెడ్డి, కోటగిరి శ్రీధర్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్స్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్, ఉప్పాల హారిక, జిల్లా కలెక్టర్ వె . ప్రసన్న వెంకటేష్, ప్రభుత్వ సలహాదారు అజేయకల్లం , సిసి ఎల్ ఏ సాయిప్రసాద్, అదనపు సిసి ఎల్ ఏ ఇంతియాజ్, వివిధ శాఖల ప్రభుత్వ కార్యదర్సులు రేవుముత్యాలరాజు, సిద్దార్థ జైన్, శశిభూషణ్ కుమార్, ఏలూరు రేంజ్ డి ఐ జి జివిజి అశోక్ కుమార్, ఎస్పీ డి.మేరీ ప్రశాంతి ,ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ, శాసనసభ్యులు నూజివీడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్,పేర్ని వెంకట్రామయ్య, దూలం నాగేశ్వరరావు , పుప్పాల శ్రీనివాసరావు, తెల్లం బాలరాజు, కోఠారు అబ్బయ్య చౌదరి, చింతలపూడి ఉన్నమట్ల ఎలీజా , తలారి వెంకట్రావు , కొక్కిలగడ్డ రక్షణనిధి, సాహిత్య అకాడమీ చైర్మన్ పిళ్ళం గోళ్ళ శ్రీలక్ష్మి, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ జి దేవి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వెజ్జు వెంకటేశ్వర్లు, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీపూజ, పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.