- దళితులపై దాడులు అరికట్టాలని మహేంద్ర కుటుంబానికి 50 లక్షలు పరిహారం ఇవ్వాలని రాజమండ్రిలో సిపిఐ సిపిఎం ధర్నా
- వైకాపా పాలనలో దళితులకు రక్షణ కరువైంది
- టి అరుణ్, తాటిపాక మధు
రాజమహేంద్రవరం: రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత సొంత నియోజకవర్గంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని
ఆ పార్టీలో జడ్పిటిసి బంధువు బొంతు మహేంద్ర మృతికి నైతిక బాధ్యత వహిస్తూ హోం మంత్రి రాజీనామా చేయాలని సిపిఐ, సిపిఎం పార్టీలు స్థానిక శ్యామల జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించాయి
అనంతరం ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శిలు టి అరుణ్, తాటిపాక మధు మాట్లాడుతూ దొమ్మేరులో వైసీపీ నాయకులు ఏర్పాటుచేసిన స్వాగత ఫ్లెక్సీ పై ఉన్న ముదునూరి నాగరాజు బోలిన సతీష్ తలకాయలను ఎవరో ఆగంతుకులు కట్ చేశారు. దీనిపై ఎస్సై బొంతు మహేంద్రను ఈనెల 13వ తేదీన పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మానసిక ఇబ్బందులు గురి చేశారు. మనస్థాపానికి గురైన మహేంద్ర నా చావుకు ప్రధాన కారకులు చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ప్రధాన కారణం హోం మంత్రి ఆమె కార్యాలయం సిబ్బంది పోలీసులకు ఫోన్ చేసి ఒత్తిడి తెచ్చారు. అందువల్ల నైతిక బాధ్యత వహిస్తూ హోం మంత్రి రాజీనామా చేయాలని వీరు డిమాండ్ చేశారు.
జగన్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు లేనంతగా తూర్పుగోదావరి జిల్లాలోనే ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని వారన్నారు. మృతుడి కుటుంబానికి కనీసం 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని వారి డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న ప్రజాసంఘాలను ప్రతిపక్ష పార్టీలను గృహనిర్బంధం చేయడం దారుణం అన్నారు. వైకాపాలో ఉన్న ఆ పార్టీ దళిత నాయకులకే రక్షణ లేకుండా పోయిందన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న దళిత సంఘాల నాయకులు అందర్నీ కలుపుకుని త్వరలో చలో దొమ్మేరు కార్యక్రమం నిర్వహిస్తామని వారి కుటుంబానికి సంఘీభావం తెలుపుతామని ఈ సందర్భంగా అరుణ్ మధు పిలుపునిచ్చారు.
ఇంకా ఈ ధర్నాలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కుండ్రపు రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, సీనియర్ నాయకులు ఎస్ ఎస్ మూర్తి, జట్టు సంఘం ప్రధాన కార్యదర్శి సప్ప రమణ, అధికార పార్టీ సభ్యులు ఆర్ వెంకట్రావు, జి వెంకట్రావు, కాళ్ల అప్పలనాయుడు, నల్ల రామారావు, మహిళా సమాఖ్య జిల్లా కో కన్వీనర్ ఎం ముత్యాలు, ఏఐఎస్ఎఫ్ నగర కన్వీనర్ ఎం స్టాలిన్, సీపీఎం నాయకులు ఐ సుబ్రహ్మణ్యం, వి.రాంబాబు, బి రామకృష్ణ, సోమేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.