పూర్తి వివరాల్లోకి వెళ్ళితే...
తూర్పు గోదావరి జిల్లా, నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంకు చెందిన మార్లపూడి ప్రభావతికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సెంటిన్నర ఇంటి స్థలానికి పట్టా మంజూరు చేసింది. ఇటీవల ఆ స్థలంలో ఇంటి నిర్మాణం ఆమె చేపట్టింది. ఐతే తన భర్త తనను విడిచిపెట్టి మరొక స్త్రీని రెండొవ వివాహం చేసుకోవడంతో ప్రభావతి సంవత్సర కాలంగా తన కుమార్తె అఖిలతో ఒంటరిగా తన తల్లి దగ్గర జీవిస్తుంది. ఒంటరి మహిళ అయిన మార్లపూడి ప్రభావతి ఇంటి నిర్మాణం చేపట్టడంతో రెండో పెళ్ళి చేసుకున్న తన భర్త గ్రామ వైయస్సార్ సిపి నాయకులు అండదండలతో ఇంటి నిర్మాణాన్ని దౌర్జన్యంగా పునాది దగ్గరే కూల్చివేసి తన రెండో భార్యకి వ్రాసి ఇవ్వాలని, మొదటి భార్యాని, కుమార్తెను వేదిస్తూ.. చంపుతానని భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని ప్రభావతి తెలిపింది.
ఈ విషయం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా అతనిపై కేసు నమోదు చేశారు. దీంతో పగ పెంచుకున్న భర్త, మరికొంతమంది వైసీపి నాయకులతో ఎలాగైనా ఆ స్థలాన్ని ప్రభావతికి దక్కకుండా చేయాలని పలు విధాలుగా ప్రయత్నిస్తూ.. వేదిస్తున్నట్లు ఆమె ఆరోపించారు. ఈ విషయంపై సంబంధిత మండల రెవెన్యూ అధికారికి ఆమె విన్నవించుకోగా "పట్టా నీ పేరున ఉండగా ఎవరు ఏంచేసేది లేదని", ఇంటి నిర్మాణం చేసుకోమని చెప్పినట్లు ఆమె చెప్పుతుంది. తనతో తన భర్తతో విడాకులు జరిగినట్లు తన భర్త వెంకటరత్నం ఏభై రూపాయల స్టాంపు కాగితాలపై ఫోర్జరీ సంతకాలతో నకిలీ విడాకుల పత్రాలు సృష్టించినట్లు తెలిసింది.
వెంకటరత్నం ఆ నకిలీ పత్రాలను అధికారులకు చూపిస్తూ ప్రభావతి పేరును ఇంటి పట్టా రద్దు చేసి రెండువ భార్య పేరును మార్చమని వైఎస్ ఆర్ సీపీ నాయకులతో ఎమ్మార్ కి ఒత్తిడి తీసుకుని రావడంతో ఎమ్మార్వో ఇరువర్గాల వారితో మాట్లాడి స్థలాన్ని ఎవరికీ చెందకుండా ఆపుతానని చెప్పడం.. ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటి వరకు "నీ పేరును ఉన్నది నీ ఇష్టం" అని ప్రభావతి కి చెప్పిన ఎమ్మార్ మరలా మాటమార్చడంపై అధికారులు పనితీరు అర్ధంమవుతుంది. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫోర్జరీ సంతకాలతో నకిలీ విడాకులు తయారు చేసిన భర్తపై ప్రభావతి చీటింగ్ కేసు పెట్టినట్టు తెలిపింది. కొంతమంది నాయకులు, అధికారులు రకరకాల పంచాయితీలు ఏర్పాటు చేసి పిలిపిస్తూ.. తనను, తన బిడ్డను మానసికంగానూ వేదిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది.
కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా వైఎస్ జగన్ తన తండ్రి పాలన ప్రజలకు అందిస్తుంటే.. వాటిని స్ధానిక నాయకులు అధికారులు మంటకలుపుతున్నారు అని అనడానికి ప్రభావతి కధ అర్థమవుతుంది. ముఖ్యంగా ఇంటి పట్టాలు మహిళలకు ముఖ్యమంత్రి జగన్ ఆడబడుచులక జగన్ను కానుకగా ఇస్తుంటే వాటిని సక్రమంగా అందించడానికి అధికారులు నాయకులు కృషి చేయవలసినది పోయి ఒంటరి మహిళను ఇబ్బందులు పెట్టడం జగన్నుకు తెలిస్తే ఊరుకుంటడాని మహిళా సంఘాల మహిళలు అంటున్నారు.
వేధింపులకు గురిచేస్తున్న భర్తపై, సహాయ సహకారాలు చేస్తున్న నాయకులు, అధికారులపై మండిపడుతున్నారు. ఒంటరి మహిళ ప్రభావతికి న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని, ఈవిషయంపై ఎస్సి, ఎస్టీ కమీషన్ చైర్మన్ కి ఫిర్యాదు చేయనున్నట్లు మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు తెలిపారు. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని, ఒంటరి మహిళ ప్రభావతిని వేదిస్తే చూస్తూ ఊరుకోమని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని మహిళ సంఘాలు, ప్రజా సంఘాలు ఆమెకు బాసటగా నిలుస్తున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళనున్నట్లు తెలిపారు.