ఢిల్లీలోని దక్షిణ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి 2023 సంవత్సరంలో ఏమేమి పనులు చేశాడో.. లేక, మరో పనేమీ పెట్టుకోలేదో ఏమో కానీ... ఏకంగా 9,940 కండోం లను ఆన్ లైన్ లో ఆర్డర్ చేశాడు. వాడం కంటే మరీ ఇలా ఉంటుందా అనిపించేలా... సరాసరిని రోజుకి 27 కండోమ్స్ చొప్పున ఆర్డర్ చేశాడు. బుడగలు చేసుకుని ఆడుకున్నాడా.. లేక, నిజంగానే “వాడుకున్నాడా” అనే సంగతి తెలియదు కానీ... ఈ విషయం మాత్రం ఇప్పుడు వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే... 2023 ఏడాది మరికొన్ని గంటల్లో ముగిసిపోతున్న నేపథ్యంలో ఆన్ లైన్ మర్చంట్ కు సంబంధించి పలు వ్యాపార సంస్థలు తాము చేసిన లావాదేవీల వివరాలను వెల్లడిస్తున్నారు. ఇందులో భాగంగా... స్విగ్గీ, జొమాటో, బుక్ మై షో, అమెజాన్ ఇలా.. అనేక ఈ కామర్స్ సంస్థలు ఈ ఏడాదిలో ఆర్డర్ల వివరాలు వెల్లడిస్తుంది. ఇందులో ప్రధానంగా ఏ వస్తువులను ఎక్కువగా ఆర్డర్ చేశారు.. ఏ ప్రాంతం నుంచి ఎక్కువగా ఆర్డర్స్ వచ్చాయి.. మొదలైన విషయాలను వెల్లడిస్తున్నారు!
ఈ సమయంలో వీటిలో ఆసక్తికరమైన ఆర్డర్లు ఎన్ని అనే లెక్కలు చెబుతూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఆన్ లైన్ ట్రేడింగ్ సంస్థ స్టోర్ బ్లింకిట్.. ఈ ఏడాదిలో వచ్చిన ఆర్డర్లు, చేసిన డెలివరీల వివరాలు వెల్లడించింది.
ఇలా ఆ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని దక్షిణ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆన్ లైన్ లో ఏకంగా 9,940 కండోమ్స్ ని ఆర్డర్ చేసి తెప్పించుకున్నాడు. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది. సహజంగా.. కండోమ్స్ అనేవి శృంగారానికి సంబంధించినవి కావడంతో వీలైనంత గోప్యంగా కొనుగోలు చేస్తుంటారు. అవి కూడా పదులు, వందల సంఖ్యలో!!
కానీ ఇతగాడి వాడకం ఏమిటో తెలియదు కానీ... ఇలా ఒకే ఏడాదిలో 9940 కండోమ్స్ ను కొనుగోలు చేయడం వైరల్ గా మారింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఎవరి స్టైల్లో వారు రియాక్ట్ అవుతున్నారు. "శృంగార వీర రణధీరా..." అని ఒకరంటే... ముత్యాలముగ్గు సినిమాలోని "ఎంతటి రసికుడవో తెలిసెరా..." అని మరికొందరు స్పందిస్తున్నారు. ఇంకొంతమంది.... "ఎవడ్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్" అని కామెంట్ చేస్తున్నారు.
ఏది ఏమైనా... ఇయర్ ఎండింగ్ టైంలో చాలా మంది సింగిల్స్ కి ఇది అత్యంత చేదు వార్త అనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం!