సంక్షేమ పధకాలు అమల్లో దాదాపు 76 శాతం ఎస్సీ, ఎస్టీ, బి.సి. , మైనారిటీ వర్గాలకు అమలు చేస్తున్నాం - మంత్రి
ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్
చింతలపూడి/ఏలూరు: రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పధకాల్లో సుమారు 76 శాతం ఎస్సీ, ఎస్టీ, బి.సి., మైనారిటీ వర్గాలకు అమలు చేస్తున్న ఘణత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికే దక్కిందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి డా. మేరుగు నాగార్జున అన్నారు.
చింతలపూడిలో సూమారు రూ. 13 కోట్లతో నిర్మించిన డా|| బి.ఆర్.అంబేద్కర్ గురుకుల(బాలురు) పాఠశాల నూతన భవనాన్ని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా, కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ లతో కలిసి రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖామంత్రి డా. మేరుగు నాగార్జున ప్రారంభించారు. అనంతరం డా. బి.ఆర్. అంభేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖామంత్రి డా. మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బి.సి. , మైనారిటీ వర్గాల ఇంటితలుపు తట్టి మరిన్ని సంక్షేమ పధకాలు అందిస్తున్నామన్నారు. గత నాలుగేళ్లలో వివిధ సంక్షేమ పధకాల కింద 2 లక్షల 35 వేల కోట్ల రూపాయలు అన్ని వర్గాల సంక్షేమానికి విడుదల చేస్తే అందులో ఎస్సీ, ఎస్టీ, బి.సి. , మైనారిటీ వర్గాలకు లక్షా 67 వేల కోట్ల రూపాయలు అందించామన్నారు. జగనన్న ప్రభుత్వంలో సామాజిక న్యాయం సాధ్యమైయిందని ఆయన స్ఫస్టం చేశారు. రాష్ట్రంలో డా. బి.ఆర్. అంభేద్కర్ ఆశయాలు విరాజిల్లుతున్నాయని పేర్కొన్నారు.
ప్రతిక్షణం పేదవారి సంక్షేమం కోసం పరితపిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలు అర్హులకు అందుతున్నాయో లేదో అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిశీలించడం జరుగుతున్నదన్నారు. కొత్త చదువులతోనే పేదల తలరాతలు మారుతాయని బావించే ముఖ్యమంత్రి పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ గత నాలుగేళ్లలో ప్రతిఅడుగు ఆదిశగానే వేస్తున్నారని చిన్నారిని తెలిపారు. తల్లులను ప్రోత్సహించి పిల్లలను బడులకు వెళ్లేలా ప్రోత్సహించేలా అమ్మఒడి పధకం నుండి మొదలు పెడితే విద్యా దీవెన, వసతి దీవెన, పౌస్టికాహారం అందించే వరకు ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. విద్యా, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత అందిస్తున్నదన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు మరింత విస్త్రృతం చేసి 3 వేలకు పైగా రోగాలకు వైద్య సేవలను జతచేయడం జరిగిందన్నారు. ఎస్సీ స్మశాన వాటికలకు కావల్సిన స్ధలం అందించేందుకు ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా మాట్లాడుతూ విద్యా, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యనిస్తున్నదన్నారు. కార్పోరేట్ విద్యాసంస్ధలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్ధలను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. గత దశాబ్దకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ గురుకుల పాఠశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేశారన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దళిత విద్యార్ధులు, తల్లిదండ్రుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాన్నారు. అదే విధంగా త్వరలోనే చింతలపూడి 100 పడకల ఆసుపత్రి కూడా నిర్మాణం పూర్తికావస్తుందన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో తపిస్తున్నారని ఆమేరకు సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రత్యేక వార్షిక క్యాలండరును అమలు చేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, సోషల్ వెల్పేర్ రెసిడెన్సియల్ స్కూల్స్ కో-ఆర్డినేటర్ యన్. సంజీవరావు, ప్రిన్సిపాల్ కిషోర్ కుమార్, తహశీల్దారు కృష్ణజ్యోతి, యంపిడిఓ మురళీకృష్ణ, లిడ్ క్యాప్ డైరెక్టర్ సొంగా సందీప్, లేబర్ వెల్పేర్ వైస్ చైర్మన్ దయాల నవీన్, ఎపి క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పోరేషన్ డైరెక్టర్ పండు జగదీష్, మాజీ ఎఎంసి చైర్మన్ సాయిబాబా, స్ధానిక సర్పంచ్ యువరాజ్, అలుగు ఆనందశేఖర్, గిరిబాబు గౌడ్, కోటగిరి సురేష్, సాంఘీక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ జయప్రకాష్, చింతలపూడి నియోజకవర్గంలోని పలు మండలాల జెడ్పిటిసిలు, యంపిపిలు, పలువురు స్ధానిక వైఎస్,ఆర్ సిపి నాయకులు పాల్గొన్నారు.