డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం: రామచంద్రాపురం పోలీసు స్టేషన్ పరిధిలో గంజాయిని సరఫరా, విక్రయిస్తున్న అయిదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 22 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఎస్. శ్రీధర్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గంజాయి ముఠా అరెస్ట్ వివరాలను ఎస్పీ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు గంజాయి చేరవేస్తున్నారనే సమాచారంతో ప్రత్యేక నిఘా ఉంచి ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ చెప్పారు.
గంజాయి సరఫరాకు సంబంధించిన మూలాలు ఎక్కడ వున్నా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 133 మంది గంజాయి సరఫరా, సేవించే వ్యక్తులను అరెస్ట్ చేశామని ఎస్పీ శ్రీధర్ తెలిపారు.
గంజాయి సరఫరా చేస్తున్న ప్రధాన నిందితులపై రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామన్నారు. ఒరిస్సా ప్రాంతం నుంచి వివిధ మార్గాల ద్వారా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారిపై పోలీస్ బృందాల సహాయంతో దాడులు నిర్వహించడం జరుగుతోందని ఎస్పీ తెలిపారు.
ఈ మార్కెట్ లో ఎన్నో ఓటిటి ప్లాట్ ఫామ్స్ వచ్చాయి.. అవి అన్ని నెలనెలా పెమేంట్ చేయాలి.. మన BCN OTT ఫ్లాట్ ఫాం పూర్తిగా ఉచితం... మీరు ఇంట్లో మరియు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ సెల్ ఫోన్ లో అన్ని చానల్స్, రెడియో ఎఫ్ ఎం, న్యూస్ పేపర్, మూవీస్స్ చూడవచ్చును.
BCN OTT