ఏలూరు జిల్లా, ఏలూరు: మధ్యాహ్నం భోజన పధకం మెనూను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజు పరిశీలించాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. మంగళవారం స్ధానిక 7వ డివిజన్ తూర్పు నగరపాలక హిందూ బాలిక ప్రాధమిక ఉన్నతపాఠశాలో మధ్యాహ్నం భోజన పధకాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా వండిన భోజన పధార్ధాలను వాటి నాణ్యతను కలెక్టర్ స్వయంగా భుజించి పరిశీలించారు. విద్యార్ధులకు అందిస్తున్న ఫిల్టర్ వాటర్ ను కలెక్టర్ త్రాగి సంతృప్తిని వెలబుచ్చారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్ధులతో ముచ్ఛటించారు.
విద్యార్ధులకు అందిస్తున్న స్కూల్ బ్యాగ్స్ పంపిణీ గురించి ఉపాధ్యాయరాలును అడిగి తెలుసుకున్నారు. నాడు-నేడు పధకం ద్వారా నిర్మిస్తున్న నూతన తరగతి గదిని కలెక్టర్ పరిశీలించి త్వరితగతిన పనులను పూర్తిచేయాలని ప్రధానోపాధ్యాయుడును, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పాఠశాల ఆవరణ పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉంచటానికి అవసరమైన మొక్కలను స్కూలు ఆవరణలో నాటాలని కలెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగా డివిజన్ కార్పోరేటర్ల సమక్షంలో పాఠశాలలో కలెక్టర్ మొక్కలను నాటారు.
ఈ కార్యక్రమానికి ముందు స్ధానిక 7వ డివిజన్ తూర్పు నగరపాలక హిందూ బాలిక ప్రాధమిక ఉన్నతపాఠశాల వద్ద 6,9,13 వార్డు సచివాలయాలకు సంబంధించిన జగనన్న సురక్ష నిర్వహణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని, అర్జీల పరిశీలన కౌంటరు, ఆధార్ నమోదు కౌంటరు, సేవల అభ్యర్ధన కౌంటరు, అర్జీల నమోదు కౌంటర్లను కలెక్టర్ పరిశీలించి అర్జీల నమోదు, ఆధార్ నమోదుకు సంబంధించిన వివరాలను, సాంకేతిక పరమైన సమస్యలను సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జగనన్న సురక్షతతో సులువుగా ధృవపత్రాలను పొందవచ్చని అర్హులందరూ ప్రభుత్వ పధకాలు పొందేందుకు అవసరమైన ధృవపత్రాలు అందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నెలరోజులు పాటు నిర్వహిస్తుందని వార్డు ప్రజలందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో స్ధానిక మహిళలు డ్రైనేజి సమస్యను పరిష్కరించమని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా కలెక్టర్ డ్రైనేజి పూడిక పనులు చేపట్టడానికి చర్యలు తీసుకోమని ఏలూరు నగరపాలక కమీషనర్ ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు నగరపాలక సంస్ధ కమీషనరు ఎస్. వెంకటకృష్ణ, అధనపు కమీషనరు బాలరాజు, నగరపాలక సంస్ధ శానిటేషన్ అధికారిణి మాలతీ, కార్పోరేటర్లు శ్రీనివాస్, నరేంధ్ర, చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.