ఏలూరు జిల్లా, ఏలూరు: రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు తిరిగి అమలు చేయాలని కోరుతూ ఈ నెల 12న విజయవాడలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఐ.ఎఫ్.టి.యు. జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది. ఐ.ఎఫ్.టి.యు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కమిటీ సమావేశం ఈరోజు అనగా 05.07.2023 బుధవారం ఏలూరు ఇఫ్టూ కార్యాలయంలో అధ్యక్షులు కె.వి. రమణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఐ.ఎఫ్.టి.యు. రాష్ట్ర సహాయ కార్యదర్శి యు. వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
భవన నిర్మాణ కార్మికులకు గత చంద్రబాబు ప్రభుత్వం గానీ, నేటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గానీ తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న సంక్షేమ పథకాలను నిలిపివేసి కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసారని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిర్మాణరంగ కార్మికుల నిధులు వారి సంక్షేమానికే ఖర్చు పెట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకున్న నిధులు తిరిగి బోర్డుకు జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిర్మాణరంగ కార్మికులకు ప్రభుత్వం జీవో నెంబర్ 215 ద్వారా నిలిపి వేసిన సంక్షేమ పథకాలు పునరుద్దరించాలనీ, ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్మాణ కార్మికుల నిధులను స్వాధీనం చేసుకోవాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలో సదస్సు జరుగుతుందని ఆయన తెలియజేశారు.
అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవలంబిస్తున్న ప్రైవేటీకరణ విధానాలను, కార్మిక చట్టాల రద్దును వ్యతిరేకిస్తూ ఈనెల 7న విజయవాడలో జరిగే కేంద్ర కార్మిక సంఘాల సదస్సుకు జిల్లా కార్మిక వర్గం హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 9న క్విట్ ఇండియా డే సందర్భంగా విజయవాడలో భారీ ర్యాలీ ఉంటుందని ఆయన వివరించారు. సమావేశంలో హమాలీ, మోటార్, అంగన్వాడి, ఎంపిహెచ్ఎ తదితర రంగాల సమస్యల గురించి చర్చించి నిర్ణయాలు చేశారు. ఇఫ్టూ జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ మోడి -షా సర్కారు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను అరికట్టే విధంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు పి. నాగేశ్వరరావు, ఎస్.రామ్మోహన్, జిల్లా సహాయ కార్యదర్శులు మామిడిదానవరప్రసాద్, ఇ.గ్రీష్మ కుమార్, యర్రా శ్రీనివాసరావు, కోశాధికారి ఎం.నాగరాజు, కమిటీ సభ్యులు జి.రాంబాబు, ఎం.. అప్పారావు, డి.ఎం. రాము, వి. పద్మ, బి.రమణ, రాచీటి జాన్, పెద్ది శెట్టి గంగరాజు, ఎన్.నెహ్రూ బాబు, కాకర్ల శ్రీను, ఎ.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఈ మార్కెట్ లో ఎన్నో ఓటిటి ప్లాట్ ఫామ్స్ వచ్చాయి.. అవి అన్ని నెలనెలా పెమేంట్ చేయాలి.. మన BCN OTT ఫ్లాట్ ఫాం పూర్తిగా ఉచితం... మీరు ఇంట్లో మరియు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ సెల్ ఫోన్ లో అన్ని చానల్స్, రెడియో ఎఫ్ ఎం, న్యూస్ పేపర్, మూవీస్స్ చూడవచ్చును.