Hot Posts

6/recent/ticker-posts

చింతలపూడిలో గోద్రెజ్ అగ్రోవేట్ లిమిటెడ్ సంస్థను వర్చ్యువల్ గా ప్రారంభించిన సిఎం వై.యస్ జగన్మోహన్ రెడ్డి


ఏలూరు జిల్లా/చింతలపూడి:  మండలంలోని చింతంపల్లి గ్రామంలో  గోద్రెజ్ అగ్రోవేట్ లిమిటెడ్ సంస్థను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి వర్చ్యువల్ విధానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహాన్ రెడ్డి గురువారం నాడు ప్రారంభించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్లాంట్ కు  అనుమతి ఇచ్చిన 9 నెలలలోనే యూనిట్ ప్రారంభించడంపై ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. 100 కోట్ల పెట్టుబడితో మరియు రోజుకు 400 టన్నుల సామర్థ్యంతో ఎడిబుల్ ఆయిల్  రిఫైనింగ్  యూనిట్, 200 టన్నుల సామర్థ్యంతో సాల్వెంట్ ఎక్సట్రాక్షన్ యూనిట్ ప్రారంభమైన ఈ సంస్థ ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు రావడం ఎంతో సంతోషంగా ఉందని అయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా 9 నెలలలోనే ప్లాంట్ కి అనుమతి ఇచ్చేందుకు కృషి చేసిన అధికారులందరిని ముఖ్యమంత్రి అభినందించారు.

జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ 100 కోట్ల పెట్టుబడితో కేవలం 9 నెలలలోనే ప్రారంభించిన 400 టన్నుల  సామర్థ్యంగల  ఎడిబుల్ ఆయిల్  రిఫైనింగ్  యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 120 మందికి మరియు పరోక్షంగా 8000 మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అన్నారు. దాదాపు 17 వేలు మంది చుట్టు ప్రక్కల గ్రామాల రైతులు, తెలంగాణ రాష్ట్ర రైతులు ఈ ప్లాంట్ ద్వారా తమ ముడి పామ్ ఆయిల్ ని రిఫైన్ చేయవచ్చని అన్నారు. అలాగే 200 టన్నుల సామర్థ్యంగల సాల్వెంట్ ఎక్సట్రాక్షన్ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 60 మందికి మరియు పరోక్షంగా 600 మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అన్నారు. రాబోయే 10 సంవత్సరాలలో ఈ ప్లాంట్ల ద్వారా ప్రభుత్వానికి దాదాపు  250 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అయన తెలియచేసారు.

చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా మాట్లాడుతూ రాష్ట్రంలో 1425 కోట్లతో 4 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ప్రారంభించడం ఒక గొప్ప కార్యక్రమం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అయన అన్నారు.  గ్లోబల్ ఇన్వెర్స్టార్ సమ్మిట్ లో చేసుకున్న ఒప్పందం ప్రకారం గోద్రెజ్ సంస్థ 100 కోట్లతో రిఫైనింగ్ యూనిట్ ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహాయ సహకారాలు అందడం వల్ల కేవలం 9 నెలలలోనే ప్లాంట్ ను ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ ప్లాంట్ ను ముఖ్యమంత్రి వై.యస.  జగన్మోహన్ రెడ్డి చేతుల మీద ప్రారంభించుకోవడం చింతలపూడి రైతాంగానికి  అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ప్లాంట్ ప్రొడక్షన్ కూడా మొదలు పెట్టాలని సంస్థ యాజమాన్యాన్ని అయన కోరారు. దేశంలోనే పామ్ ఆయిల్ సాగు ఎక్కువగా ఉన్న చింతలపూడి నియోజకవర్గంలో రైతులు పడుతున్న ఇబ్బందులను రాష్ట్ర ముఖ్యమంత్రికి 2019లో ప్రచారానికి వచ్చినపుడు  వివరించడం జరిగిందని ఆ తరువాత ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తెలంగాణ మరియు ఆంధ్రా రైతులకు ఉన్న వ్యత్యాసాన్ని పూడ్చడానికి  82 కోట్లు మంజూరు చేసారని అన్నారు. అలాగే రైతులకి సరిపడా పామ్ ఆయిల్ మొక్కలను అందించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్,జి ఎం ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఏసుదాస్, ఉద్యానవన శాఖ డి డి రామ్ మోహన్, ఎమ్మార్వో కృష్ణ జ్యోతి, ఎంపీడీఓ మురళీకృష్ణ, ఎం పి  పి  రాంబాబు, జెడ్పిటిసి నీరజ, చింతలపూడి ఏ ఎం సి చైర్మన్ జానకి రెడ్డి, సర్పంచ్లు మల్లేశ్వరి, రామకృష్ణ, గోద్రెజ్ అగ్రోవేట్ జి ఎం సాజు మాత్యు, డి జి ఎం హెచ్ ఆర్ ప్రవీణ్, డి జి ఎం ఫైనాన్స్ శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.