ఏలూరు జిల్లా ఏలూరు: పౌష్టికాహార లోపాలను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ మెరుగైన ఆరోగ్యం కోసం ఫోర్టిఫైడ్ బియ్యమును జూలై 1 నుండి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీకి చర్యలు తీసుకున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి వెల్లడించారు.
గురువారం కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో పాత్రికేయుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ లావణ్య వేణి మాట్లాడుతూ జిల్లాలో 6.5 లక్షల కార్డుదారులకు 9500 మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడంలో భాగంగా అందరికీ మెరుగైన ఆరోగ్యం కోసం ఫోర్టిఫైడ్ బియ్యమును ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా, అంగన్వాడి కేంద్రం ద్వారా గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు, 7-72 నెలల పిల్లలకు, ప్రధానమంత్రి పోషణ, జగనన్న గోరుముద్ద ద్వారా మరియు అన్ని సంక్షేమ సంస్థలకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఫోర్టిఫైడ్ బియ్యం అనగా బియ్యాన్ని పిండి చేసి దానికి ఐరన్, ఫోలిక్ ఆమ్లం మరియు విటమిన్ బి12 వంటి విటమిన్లు, పోషకాలను కలిపి ఆనంతరం బియ్యం పోలికతో కెర్నల్స్ గా చేసి ఆయా పరిశ్రమల నుండి మిల్లర్లకు సరఫరా చేయడం జరుగుతుంది.
ప్రతి క్వింటాల్ బియ్యానికి ఒక కిలో ఫోర్టిఫైడ్ కెర్నల్స్ ను ప్రత్యేక యంత్రాలు ద్వారా కలిపి తయారుచేసిన మొత్తం బియ్యాన్ని రైస్ మిల్లుల ద్వారా సేకరించడం జరుగుతుందని తెలిపారు. ఫోర్టిఫైడ్ బియ్యాన్ని మిల్లుల నుండి అనుసంధానం చేసిన గోదాములకు తరలించడం అనంతరం మండల స్థాయి స్టాక్ పాయింట్లు చేరి తద్వారా రేషన్ షాపులకు తరలించడం జరుగుతుందన్నారు .
తదుపరి అన్ని సంక్షేమ సంస్థలకు, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం మరియు ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఎండీయూ వాహనాలలో పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇవి తినడం వల్ల పోషకాహారం లోపం ఉండదని తెలిపారు. దీని ద్వారా మానసిక అభివృద్ధిని సాధించొచ్చు అని అన్నారు. ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల నందు పోర్టిఫైడ్ రైస్ ను ప్రజల తెలియక ప్లాస్టిక్ రైస్ గా భావిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చినందున రాష్ట్ర ప్రభుత్వం వారు పోర్టిఫైడ్ రైస్ గురించి ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించడానికి ప్రచార మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ కోరారు.
ఈ మార్కెట్ లో ఎన్నో ఓటిటి ప్లాట్ ఫామ్స్ వచ్చాయి.. అవి అన్ని నెలనెలా పెమేంట్ చేయాలి.. మన BCN OTT ఫ్లాట్ ఫాం పూర్తిగా ఉచితం... మీరు ఇంట్లో మరియు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ సెల్ ఫోన్ లో అన్ని చానల్స్, రెడియో ఎఫ్ ఎం, న్యూస్ పేపర్, మూవీస్స్ చూడవచ్చును.