ఏలూరు, పశ్చిమ వాహిని, మే 6: ఏలూరులోని శ్రీ సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ విద్యార్థులను ఘనంగా సన్మానించారు. బుధవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో టాపర్లకు నగదు బహుమతులు మరియు పురస్కారాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన చదువు, కష్టపడి పనిచేసే తత్వం ఉన్న విద్యార్థులు ఏ రంగంలోనైనా రాణించగలరని పేర్కొన్నారు. విద్యార్థులు కేవలం మార్కులకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకోవాలని సూచించారు. విద్యార్థుల విజయాల్లో ఉపాధ్యాయుల కృషితో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఎంతో కీలకమని కొనియాడారు.
పోలీస్ స్కూల్ విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు అందించడంలో జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని ఎస్పీ హామీ ఇచ్చారు. విద్యార్థులు తమ విజయ ప్రస్థానాన్ని ఇదే ఉత్సాహంతో కొనసాగించి భావి భారత పౌరులుగా సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.
టాపర్ల వివరాలు – నగదు బహుమతులు
జె. లేఖ శ్రీవల్లి – 591/600 మార్కులు – రూ.25,000
బి. జ్యోతిక గణేశ్వరి – 582/600 మార్కులు – రూ.15,000
కె. హర్షవర్ధిని – 578/600 మార్కులు – రూ.10,000
పిధాన శ్రీ శ్రేష్ట – 569/600 మార్కులు – రూ.5,000
జి. సుభాషిణి – 567/600 మార్కులు – రూ.5,000
టి. మారుతి దుర్గా – 565/600 మార్కులు – రూ.5,000
వి. తేజ హంసిని – 563/600 మార్కులు – రూ.5,000
బి. ప్రాన్స్ స్టెల్లా – 556/600 మార్కులు – రూ.5,000
పి. కామాక్షి – 555/600 మార్కులు – రూ.5,000
బి. యశ్వంత్ కుమార్ – 554/600 మార్కులు – రూ.5,000
పి. కుందన సాయి శ్రీవల్లి – 554/600 మార్కులు – రూ.5,000
పి. కశ్మిత కుమారి – 553/600 మార్కులు – రూ.5,000
ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ సతీష్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్రవంతి, ఆర్‌ఎస్‌ఐ నరేంద్ర, ప్రసాద్ నాయక్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


