తాజా వార్తలు

10/recent/ticker-posts

సిఎస్ఆర్(CSR) నిధులు గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి: కలెక్టరు కె.వెట్రిసెల్వి


ఏలూరు, మార్చి 28: జిల్లా కలెక్టరేటు ప్రాంగణంలో శనివారం సిఎస్ఆర్ నిధులతో రూ 8 లక్షలు విలువ చేసే మహీంద్రా ట్రాక్టరును గోద్రెజ్ సంస్థ ప్రతినిధులు శనివారం జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వికి అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెవ్వి మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధులు గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు మొదటి ప్రాధాన్యను ఇవ్వాలని అన్నారు. గ్రామీణ అభివృద్ధికి, శానిటేషన్ పనుల్లో యంత్రాలు వినియోగం కీలకమని పేర్కొన్నారు. ట్రాక్టరు ద్వారా గ్రామంలో శానిటేషన్, రోడ్ల మరమ్మతులు, మురుగు తొలగింపు వంటిపనులు వేగవంతంగా నిర్వహించవచ్చునని తెలిపారు. 

గ్రామ పంచాయతీ అభివృద్ధికి సిఎస్ఆర్ నిధులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, ఈ ట్రాక్టరును గ్రామీణ ప్రజలు పారిశుద్ధ్య అవసరాలకు సమర్థవంతంగా వినియోగించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారికి సూచించి, డిపిఓ కి ట్రాక్టర్ ను కలెక్టర్ అందజేశారు. సీఎస్ఆర్ నిధుల నుండి ట్రాక్టర్ ను అందించిన గోద్రెజ్ సంస్థను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. 

ఈ కార్యక్రమంలో ఇంచార్చి రెవిన్యూ అధికారి కె.భాస్కర్, జిల్లా పంచాయతీ అధికారి కె.అనురాధ, జిల్లా సిపివో యస్.శ్రీదేవి, ఏవో యన్.వి.నాంచారయ్య, గోద్రెజ్ సంస్థ హెచ్ ఆర్ హెడ్ యస్.సంపదరావు, తదితరులు పాల్గొన్నారు.