జంగారెడ్డిగూడెం, పశ్చిమావహిని, 21: గోకుల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లో శనివారం సందర్భంగా భక్తుల రద్దీ భారీగా నెలకొంది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారు జామున 4.30 గంటలకు సుప్రభాత సేవ, ఆరాధన, తోమల సేవ, బాలభోగ నివేదన, తీర్థప్రసాద గోష్టి వంటి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అనంతరం భక్తులు విశేష అలంకరణలో శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. సెలవు రోజు కావడంతో పాటు పరీక్షల కాలం నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, జిల్లా నలుమూలల నుండి వేలాదిగా తరలి వచ్చారు. గిరి ప్రదక్షిణకు కంకణం ధరించి, ఏడు శనివారాల దీక్షలో భాగంగా భక్తులు “గోవిందా” నామస్మరణతో ఆలయాన్ని మారుమ్రోగించారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ధర్మకర్త మండలి సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు. ఈరోజు అన్నదాతలుగా జంగారెడ్డిగూడెంకు చెందిన భోగవల్లి రత్నజిరావు, శ్రీమతి బంగారు లక్ష్మి సేవలందించారు. వీరిని ఆలయ అర్చకులునల్లూరి రవికుమార్ ఆచార్యులు శ్రీవారి శేషవస్త్రాలు, ప్రసాదాలతో వేద ఆశీర్వచనాల మధ్య సన్మానించారు.
పూజా టికెట్లు, ప్రసాదాలు, విరాళాలు, అన్నదానం ద్వారా ఈరోజు ఆలయానికి మొత్తం రూ.1,39,000 ఆదాయం వచ్చినట్లు ఈఓ కలగార శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు అన్నప్రగడ వీరరాఘవరావు, కొప్పుల నాగ సురేంద్ర, ఆరెపల్లి నాని, వడిగళ్ల కుమారి శ్రీను, ముప్పిడి భానువిష్ణు, ప్రియాంక, దివ్య ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.



.jpeg)








