తాజా వార్తలు

10/recent/ticker-posts

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఆందోళనలో రైతులు


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వాతావరణ వార్తలు: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది భారత వాతావరణ శాఖ అధికారలు వెల్లడించారు. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుందని వివరించింది. అందువల్ల భారీ వర్షాలు కరుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈరోజు (సోమవారం)నుంచి వచ్చే నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తెలంగాణలో ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, హైదరాబాద్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో సోమ, మంగళ, బుధవారాల్లో వర్షాలు విస్తారంగా కరుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ క్రమంలోనే సోమవారం కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ మండలం హంగర్గ గ్రామంలో వడగండ్ల వాన కురవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. మరోవైపు హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రాత్రి సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజుల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అలాగే, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, రాయలసీమలోని నంద్యాల, కర్నూల్, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. మరోవైపు అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమలతోపాటు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.