తాజా వార్తలు

10/recent/ticker-posts

ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు… రహదారి భద్రతకు పోలీసుల చర్యలు


పెదవేగి, పశ్చిమవాహిని, మార్చి 18: రహదారి భద్రతను మెరుగుపరచడం, ప్రమాదాలను నివారించడం లక్ష్యంగా ఏలూరు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు.


పెదవేగి మండలం వంగూరు గ్రామ సమీపంలో ప్రమాదకరంగా గుర్తించిన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ సూచనలతో పెదవేగి సర్కిల్ ఇన్స్పెక్టర్ సి.హెచ్. రాజశేఖర్, ఎస్ఐ హరి గోపాల్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి ఈ ఏర్పాట్లు చేశారు.

వంగూరు ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వాహనదారులను అప్రమత్తం చేయడానికి “ప్రమాదకర మలుపు – వేగం తగ్గించండి” వంటి సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా పోలీసులు రాత్రివేళల్లో, మలుపుల వద్ద వాహనదారులు జాగ్రత్తగా నడపాలని, అతివేగం ప్రాణాంతకమని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

పెదవేగి సర్కిల్ పరిధిలో ప్రమాదాల ప్రబల ప్రాంతాలను గుర్తించి ఇలాంటి భద్రతా చర్యలు కొనసాగిస్తామని, దీని ద్వారా విలువైన ప్రాణాలను కాపాడవచ్చని పోలీసు అధికారులు తెలిపారు.