ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శాఖలవారీగా పెండింగులో ఉన్న బకాయిలను నిర్ణీత గడువులోగా ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో జీఎస్టీ ఏరియర్స్‌కు సంబంధించి 249 కేసుల ద్వారా రూ.24 కోట్లు రావాల్సి ఉన్నందున ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
🔎 జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
కమర్షియల్ టాక్స్, సివిల్ సప్లై, మైన్స్, పోలీసు శాఖలతో కలిసి జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి రెవెన్యూ వసూళ్లపై నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రతి నెల రెండో వారంలో జిల్లా స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని, మండల స్థాయిలో కూడా ఇదే విధంగా సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
🚛 ఈ-వే బిల్ తనిఖీలు, చెక్‌పోస్టులు
రవాణా అవుతున్న సరుకులకు సంబంధించి ఈ-వే బిల్లులు, ఇన్వాయిసులు కచ్చితంగా తనిఖీ చేయాలని, సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ రవాణాను అరికట్టాలని ఆదేశించారు. పన్ను ఎగవేతలను నిరోధించేందుకు కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించడంతో పాటు వ్యాపార వర్గాలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
🏗️ పోలవరం, ఇతర శాఖల చెల్లింపుల పరిశీలన
పోలవరం ప్రాజెక్టు పనులు, ఆర్ & ఆర్ ప్యాకేజీలకు సంబంధించిన కాంట్రాక్టర్లకు చెల్లించిన మొత్తాలపై టాక్స్ జమ అయిందా లేదా అన్నది వెరిఫై చేయాలని తెలిపారు. ఏపీ డబ్ల్యూ ఐడీసీ, ఆర్ & బి, పంచాయతీరాజ్, గృహనిర్మాణ శాఖలతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు.
💰 ఆదాయ వనరుల పెంపు
ఖనిజాలు, ఇసుక, భూముల లీజులు, వాణిజ్య పన్నులు, స్టాంపు డ్యూటీలు వంటి వనరుల ద్వారా ఆదాయం పెంచే మార్గాలపై చర్చించారు. ప్రభుత్వ ఆస్తుల వినియోగాన్ని మెరుగుపరచడం, లీజులను పారదర్శకంగా నిర్వహించడం, డిజిటల్ విధానంలో వసూళ్లు చేయడం ద్వారా ఆదాయం పెంపు సాధ్యమని పేర్కొన్నారు.
ప్రతి శాఖ అధికారి తమ శాఖకు సంబంధించిన వసూళ్ల లక్ష్యాలను నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నెలవారీ సమీక్షల ద్వారా పురోగతిని పరిశీలిస్తామని తెలిపారు.
👥 సమావేశంలో పాల్గొన్నవారు
ఈ సమావేశంలో జిల్లా ఏఎస్పీ నక్కా సూర్య చంద్రరావు, జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, కమర్షియల్ టాక్స్ జాయింట్ కమిషనర్ బి. నాగార్జునరావు, ఆర్ & బి ఎస్‌ఈ కె. విజయరత్నం, జడ్పీ సీఈఓ ఎం. శ్రీహరి, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారి జి. త్రినాథబాబు, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ పి. శివరామమూర్తి, డీఎస్ఓ ఇ.బి. విలియమ్స్, మైన్స్ డీడీ జి. పాపారావు, డీఐసీ జీఎం ఆర్. వెంకటరావు, లీగల్ మెట్రాలజీ సహాయ కంట్రోలర్ కె.ఎస్. రాజు తదితర అధికారులు పాల్గొన్నారు.







