అంబేడ్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 12: మామిడికుదురు మండలంలోని ఆల్ క్యాస్ట్ కాలనీలో ఈరోజు (గురువారం) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 11 తాటాకు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదం వల్ల 13 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మరికొన్ని ఇళ్లకు మంటలు వ్యాపించకుండా త్వరితగతినే మంటలను అదుపుచేశారు.
ఈ ప్రమాదంలో 13 కుటుంబాలకు చెందిన విలువైన గృహోపకరణాలు, వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఓ వ్యక్తి గ్యాస్ సిలిండర్ వెలిగించే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అగ్నిమాపక శాఖ అధికారులు ప్రస్తుతం ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తున్నారు. పరిహారం, పునరావాసం కోసం సంబంధిత అధికారులు చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాద ఘటనతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.
.jpg)






