ANDHRAPRADESH:డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో : అమలాపురం లో పాస్టర్ల యూ.పి.ఎఫ్ మీటింగ్ నోబెల్ రాయ్ అధ్యక్షతనమన్నా జూబ్లీ చర్చ్ ఈదరపల్లి నందు ఆశీర్వాదకరంగా జరిగినది.జిల్లా యూ.పీ.ఎఫ్ సెక్రటరీ యమ్. యెహోషువ వాక్య సందేశం అందించారు.
అనంతరం నూతన కార్యవర్గ ఎన్నిక ప్రజాస్వామ్య పద్ధతిలో సమాధానముగా దీవెనకరంగ జరిగింది.. సభలో గౌరవనీయులు పెద్దలు జిల్లా యుపీఎఫ్ అధ్యక్షులు మాట్లాడుతూ ఇదివరకు ఎన్నడు జరగని విధంగా మీటింగ్స్ జరగాలి ప్రతి ఒక్కరు ఐక్యతతో ఉండాలి.
దైవజనులకు అందుబాటులో ఉండాలి ఏ సమస్య వచ్చిన వారికి అండగా ఉండాలి అంతేకాకుండా యూపీఎఫ్ కార్యవర్గం వారు తమ బాధ్యతలను సక్రంగా నిర్వర్తిస్తూ దైవజనులందరికి అందుబాటులో ఉండాలని మందిరాలపై జరుగుతున్న దాడులకు ముందుండి అడ్డుకోవాలని తమ వంతు పనిని జరిపించాలని నూతన కార్యవర్గానికి తెలియజేశారు అంతేకాకుండా ఈ యుపిఎఫ్ ను మరింత ఫలబరితం చేయాలని సూచనలు ఇచ్చారు ఈ యుపిఎఫ్ లో నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గం వారు
*ప్రెసిడెంట్: నోబెల్ రాయ్*
*వైస్ ప్రెసిడెంట్: ఆనందరావు*
*సెక్రటరీ: డేనియల్*
*జాయింట్ సెక్రెటరీ : సామ్యూల్*
*ట్రెజరర్ : జోషఫ్*
*జాయింట్ ట్రెజరర్: ప్రసాద్*
జిల్లా యూ.పీ.ఎఫ్ ప్రెసిడెంట్: రెవ.కారల్ డేవిడ్ కొమానపల్లి* అయ్యగారు ప్రార్ధన ఆశీర్వాదంతో మీటింగ్ ముగించబడింది