ANDRAPRADESH: వాస్తవానికి పోలీసు ఉద్యోగం అంటేనే.. కత్తిపై సాము. సాధారణ పౌరుల విషయంలో దురుసుగా వ్యవహరించే ఖాకీలు.. రాజకీ య నేతల విషయానికి వస్తే.. ఆచితూచి అడుగులు వేసే పరిస్థితి గత దశాబ్ద కాలంగా ఏపీలో కొనసాగుతోంది. `కరవమంటే కప్పకు కోపం.. వదల మంటే పాముకు కోపం` - అన్నట్టుగా తయారైంది.. ఏపీ పోలీసుల పరిస్థితి. వారి తలపై ఉండే మూడు సింహాలు.. చట్టానికి, న్యాయానికి, ధర్మానికీ ప్రతీకలైతే.. యూనిఫాం ధరించి ప్రజల కోసం పనిచేసే పోలీసును నాలుగో సింహంగా భావిస్తుంది.. సమాజం! అలాంటి నాలుగో సింహం ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్ల మధ్య సతమతం అవుతూ.. నలిగిపో తోంది. అటు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు-ఇటు ప్రతిపక్ష నాయకుల బెదిరింపులు, హెచ్చరికల మధ్య నాలుగో సింహం నిజంగానే నలుగుతోంది!!
టీడీపీలో అంతర్మథనం వాస్తవానికి పోలీసు ఉద్యోగం అంటేనే.. కత్తిపై సాము. సాధారణ పౌరుల విషయంలో దురుసుగా వ్యవహరించే ఖాకీలు.. రాజకీయ నేతల విషయానికి వస్తే.. ఆచితూచి అడుగులు వేసే పరిస్థితి గత దశాబ్ద కాలంగా ఏపీలో కొనసాగుతోంది. టీడీపీ అధికారం లో ఉన్న2014-19 మధ్య, తర్వాత.. వైసీపీ అధికారంలో ఉన్న 2019-24 మధ్య పోలీసులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. టీడీపీ హయాంలో కొంత ఫర్వాలేదని అనిపించినా..వైసీపీ హయాంలో హద్దులు దాటేశారన్నది.. అధికార పక్షానికి సేవ చేశారన్నది ప్రధాన ఆరోపణ. అందుకే పలు సందర్భాల్లో హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.
వాస్తవానికి దేశవ్యాప్తంగా కూడా పరిస్తితి ఇలానే ఉందని.. నేర నిర్ధారణ కన్నా.. రాజకీయ నిర్ధారణలు పెరిగిపోయాయని.. తాజాగా మంగళవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సివిల్ కేసులకు-క్రిమినల్ కేసులకు తేడాలే తెలిసిన కూడా.. రాజకీయ ప్రాధాన్యంతో సివిల్ కేసులను కూడా క్రిమినల్ కేసులుగా మారుస్తున్నారని.. ప్రతి ఒక్కరినీ రాజకీయ నేరస్తుల కోణంలో చూస్తున్నారని సుప్రీంకోర్టు పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవి. యూపీలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసినా.. దేశ వ్యాప్తంగా మాత్రం పరిస్థితి ఇలానే ఉందని నిపుణులు చెబుతున్నారు.
ప్రత్యేకంగా ఏపీ విషయాన్ని తీసుకుంటే.. వైసీపీ హయాంలో టీడీపీ నేతలపైనా.. టీడీపీ కూటమి సర్కారు హయాంలో వైసీపీ నేతలపైనా.. పోలీసులు వ్యవహరిస్తున్నతీరును ఇటీవల హైకోర్టు కూడా తప్పుబట్టింది. ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు పై.. కర్నూలు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. ఈ కేసులో బలం లేదని భావించిన ఎస్సై ఒకరు.. అతనిపై దోపిడీ కేసు పెట్టాడు. దీనిని తీవ్రంగా తప్పుబట్టిన హైకోర్టు.. "దీనివెనుక ఎవరున్నారో తేలుస్తాం" అంటూ.. వ్యాఖ్యానించడం చర్చకు వచ్చింది. ఇక, తాజాగా జగన్ హెచ్చరికలు.. గతంలో చంద్రబాబు వార్నింగులు, నారా లోకేష్ రెడ్ బుక్ వ్యాఖ్యలు వంటివి.. పోలీసుల తీరుపై చేసినవే కావడం గమనార్హం. ఎలా చూసుకున్నా.. నాలుగో సింహం నలుగుతోందన్నది వాస్తవం!!