ANDRAPRADESH: వైసీపీ అధినేత జగన్‌పై కామ్రెడ్ నారాయణ కన్నెర్ర చేశారు. వక్ఫ్ బిల్లుపై జగన్ దొంగాట ఆడుతున్నారని విమర్శలు గుప్పించారు. తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడిన నారాయణ.. వైసీపీ అధినేతపై నిప్పు లు చెరిగారు. వక్ఫ్ బిల్లుపై వైసీపీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని చెప్పారు. లోక్‌సభలో ఒక విధంగా రాజ్యసభలో మరో విధంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. లోక్‌సభలో బిల్లుకు వ్యతిరేకంగా స్పందిం చిన జగన్.. రాజ్యసభలో అనుకూలంగా ఓటేసిందన్నారు.
దేశంలో ముస్లింలు ఉండకూడదన్న దురుద్దేశంతోనే మోడీ ప్రభుత్వం వక్ఫ్‌బిల్లును తీసుకువచ్చిం దని నారాయణ దుయ్యబట్టారు. ముస్లింల ఆస్తులను కూడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే పన్నాగం ఉంద ని.. దీనిని అర్ధం చేసుకోలేక పోతున్నారని అన్నారు. మోడీతో అంటకాగుతున్న పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేయనున్నట్టు తెలిపారు. ఈ నెల12న దేశవ్యాప్తంగా ఉద్యమించనున్నట్టు చెప్పారు.
జగన్‌కు నోటి దూల ఎక్కువైందని కామ్రెడ్ నారాయణ విమర్శించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఆ మాత్రం తెలియదా? అని ప్రశ్నించారు. ``పోలీసుల బట్టలు ఊడబెరుకు తాడంట పోటుగాడు. ఈయనకు ప్రజలే బట్టలు ఊరబెరికారు. ముందు ఆవిషయం తెలుసుకోవాలి`` అని నెల్లూరు స్లాంగ్‌లో చరకలు అంటించారు. పోలీసుల మనోధైర్యం దెబ్బతినేలా, వారిని అవమానించేలా మాట్లాడడం ఎవరికీ సరికాదన్నారు. ఇలాంటి నోటి దూల నేతలకు మళ్లీ అధికారం ఎవరిస్తారు? ముందు ఆవిషయం తెలుసుకుంటే అందరికీ మంచిది.. అని వ్యాఖ్యానించారు.