తాజా వార్తలు

10/recent/ticker-posts

థాయిలాండ్‌లో ఘోరం.. 34 మందిని కాల్చి చంపేశాడు


ఇంటర్నెట్ డెస్క్, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 11: దక్షిణ థాయిలాండ్‌ లో ఘోరం జరిగింది. బుధవారం మధ్యాహ్నం సోంగ్ఖా హ్యాట్ హెయ్ జిల్లాలోని ఓ పాఠశాల(School)లో ఓ సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడు. నిందితుడు జరిపిన కాల్పుల్లో 22మంది చిన్నారులు సహా 34మంది మరణించారు. 

చాలా మందిని అతను బందీలుగా చేసుకున్నాడు. పాఠశాలలో కాల్పుల మోత వినపడగానే రోడ్డుపై జనాలు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 

అనేక మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాల లోపల చిక్కుకున్నారని పోలీసులు తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు హాట్ యాయ్ పోలీసులు పాఠశాలను చుట్టుముట్టారు. సాయుధుడితో చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు. 

కాల్పులు జరిపిన వ్యక్తికి 18 ఏళ్ల వయసు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పాఠశాల లోపల ఉన్న బందీలను సురక్షితంగా విడిపించేందుకు భద్రతా దళాలు ప్రస్తుతం ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.