ANDRAPRADESH: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే 24 గంటల్లో ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్ర జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు, రాయలసీమలో 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశముందని అంచనా వేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో ఆకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు.
గురువారంవిశాఖపట్న, కాకినాడ, ప్రకాశం, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు,పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిశాయి. పార్వతీపురం మన్యం, విజయనగరం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి వర్షాలు పడ్డాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా వేడిగాలులు 21మండలాల్లో వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది.
పార్వతీపురం మన్యం జిల్లాలో-2, అల్లూరి సీతారామరాజు-1, ఏలూరు-1, కృష్ణా-6, ఎన్టీఆర్-4, గుంటూరు-2, బాపట్ల-3, పల్నాడు-2 మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉంది. గురువారం ప్రకాశం జిల్లా నందనమారెళ్ళలో41.8 డిగ్రీలు, తిరుపతి జిల్లా వెంకటగిరిలో41.1 డిగ్రీలు, చిత్తూరు జిల్లా నగరి, కడప జిల్లా ఒంటిమిట్టలో41డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.