కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు: నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పరుపుల సత్యప్రభ రాజాని ఎమ్మెల్యే అభ్యర్థిగా గురువారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 2019 ఎన్నికలులో పరుపుల సత్య ప్రభ రాజా భర్త వరుపులు రాజా వైసిపి పై స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం, ఆయన ఇటీవల గుండుపోటుతో దుర్మరణం చెందడంతో, ప్రత్తిపాడు నియోజకవర్గంలో రాజా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తన సొంత ఖర్చులతో నిర్వహించటం జరిగింది. ఈ పరిణామాల వల్ల సత్య ప్రభరాజాకి నియోజకవర్గంలో విపరీతమైన సానుభూతి ఏర్పడింది. వాటిని బేరీజు వేసుకొని నారా చంద్రబాబు నాయుడు ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా ఆమెను ప్రకటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. పలుచోట్ల టిడిపి అభిమానులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు.