ఏలూరు జిల్లా, చింతలపూడి: ప్రభుత్వ డిగ్రీకళాశాలలో గణిత శాస్త్ర ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ పై డే ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. పి శ్రీనివాసరావు మాట్లాడుతూ అంతర్జాతీయ పై డే చరిత్రను తెలియజేశారు. ఈ సందర్భంగా ఐన స్టీన్ జన్మదినo జరుపుకోవడం జరిగింది. వృత్తం చుట్టుకొలత దాని వ్యాసము, నిష్పత్తిని తెలియజేస్తుందని మరియు పై విలువను 3.1415926... గా సూచించారు.
విద్యార్థులు ఈ ఫై డే ను గణిత శాస్త్రంలో మరియు సైన్స్ వారు ఎక్కడ ఎలా ఉపయోగిస్తారు అనే విషయాలని సవివరంగా తెలియజేయడం జరిగింది. కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎ న్ జె కె నరేంద్ర కుమార్ మాట్లాడుతూ పై డేను మార్చ్ 14 మరియు జూలై 22 గా జరుపుకుంటారని అన్నారు. ఈ పై డే ను స్ఫూర్తిగా తీసుకావాలని విద్యార్థులకు తెలిపారు. ఐక్యూ ఎస్సీ కోఆర్డినేటర్ డా. సయ్యద్ మీర్ అసిన్ విద్యా, వినోదం గురించి తెలియజేశారు, డాక్టర్ ఏ సంతోష్ చరిత్ర అధ్యాపకులు గణితంలో ఉపయోగించుపై విలువను సవివరంగా తెలియజేశారు.
గణిత శాస్త్ర విభాగ అధిపతి డా. డి దేవానందం మాట్లాడుతూ గణిత శాస్త్రంలో ఉపయోగించు పై విలువను మొదటిసారిగా బ్రిటిష్ మ్యాథమెటిషియన్ వి లియం జోన్స్ 1706 లో పై ను గ్రీక్ అక్షరము గా తీసుకున్నారు. విద్యార్థుల్లో గణిత శాస్త్రం పట్ల అవగాహనను పెంపొందించే విధంగా పై డేను జరుపుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.