ఏలూరు జిల్లా : చింతలపూడి భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాఇని, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి ఫూలే 192వ జయంతి వేడుక స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లీషు మరియు ఎన్ఎస్ఎస్ శాఖల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి శ్రీనివాసరావు అధ్యక్షత వహించి సావిత్రిబాయి సేవలను కొనియాడగా, కార్యక్రమ నిర్వహకులలో ఒకరైన డాక్టర్ ఏ వెంకటేశ్వరరావు, సావిత్రిబాయి బహుజన జీవితాలను ఎలా ప్రభావితం చేసిందో, ఎలా ఆదర్శమూర్తిగా నిలబడిందో సోదాహరణంగా వివరించారు.
ఈ కార్యక్రమ ప్రధాన నిర్వాహకుడైన బి. శ్రీనివాసరావు, సావిత్రిబాయి తన భర్త అయినా మహాత్మ జ్యోతిబాఫూలే ఆశయ సాధనలో ఎలా తోడుగా నిలబడ్డారో మరియు ఒక గొప్ప మానవతావాదిగా సమాజ సంక్షేమానికై తన జీవితాన్ని ఏ విధంగా బలిపీఠం ఎక్కించారో వివరించారు . కల్చరల్ కోఆర్డినేటర్ అయిన డాక్టర్ బి సరస్వతి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.