Hot Posts

6/recent/ticker-posts

జిల్లాలో కొత్తగా 4,531 రైస్ కార్డులు మంజూరు: జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి..


 ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఏలూరు జిల్లాలో ప్రస్తుతం ఉన్న 6,30,215 కార్డుదారులకు ప్రతి నెలా బియ్యం మరియు నిత్యావసర సరుకులను పంపిణీ జరుగుచున్నది.   ద్వైవార్షిక పధకంలో భాగంగా ఏలూరు జిల్లాలోని అర్హులై ఉండి, ఆగష్టు, 2023 నుండి డిసెంబర్ 2023 మధ్య క్రొత్త రైస్ కార్డు మరియు కార్డు విభజన కొరకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికి కొత్త బియ్యం కార్డులను మంజూరు చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి తెలిపారు.       

జిల్లాలోని 27 మండలాల వారీగా కొత్త బియ్యం కార్డుల వివరములు....

ఏలూరు 571,

నూజివీడు 251, 

ద్వారకా తిరుమల 187,

కలిదిండి 183, 

కైకలూరు 145,

లింగపాలెం 140,

నిడమర్రు 172,

ఉంగుటూరు 191,

చింతలపూడి 260,

చాట్రాయి 118, 

అగిరిపల్లి 150, 

పోలవరం 108, 

జంగారెడ్డిగూడెం 292, 

టి.నరసాపురం 148, 

దెందులూరు 185,

భీమడోలు 152, 

కామవరపుకోట 145, 

బుట్టాయి గూడెం 103,

కొయ్యలగూడెం 167, 

మండవల్లి 122, 

పెదపాడు 174,

వైలెరుపాడు 24,

జిల్లుగుమిల్లి 41, 

కుకునూరు 49, 

ముదినేపల్లి 116, 

ముసునూరు 118,

పెదవేగి 213,  

మొత్తం 4531

పై తెలిపిన విధముగా ఏలూరు జిల్లాలో  క్రొత్తగా 4531 కార్డులను మంజూరు చేయడం జరిగినది. ఈ క్రొత్తగా మంజూరు చేసిన కార్డుదారులందరికి ఈ నెల అనగా  జనవరి నెల నుండే బియ్యం మరియు ఇతర నిత్యావసర సరుకులను పంపిణీ చేయుటకు గాను జిల్లాలోని పౌర సరఫరాల అధికారులందరికి ఆదేశాలను జారీచేయడం జరిగినది.

 

కావున క్రొత్తగా కార్డులు మంజూరు అయిన 4531 కార్డుదారులందరూ, ప్రస్తుతం జిల్లాలో ఉన్న630215 కార్డులతో పాటు అందరూ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయబడుతున్న నాణ్యమైన పోర్టిఫైడ్ బియ్యం ఉచితముగా మరియు నిత్యావసర సరుకులను సబ్సిడిపై యండియు వాహనాల ద్వారా ఇంటి వద్దనే పొందవలసినదిగా తెలియజేయడమైనది.